మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన సుమంత్‌

30 May, 2019 17:10 IST|Sakshi

సుబ్రహ్మణ్యపురం, ఇదంజగత్‌ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినా మళ్లీ హిట్‌ కొట్టాలని కొత్త కథలకు ఓకే చెబుతున్నాడు హీరో సుమంత్‌. మళ్లీ రావా తరువాత మళ్లీ ఆరేంజ్‌లో సక్సెస్‌కొట్టలేకపోయాడీ హీరో. తాజాగా ఓ డిఫరెంట్‌ కథతో తెరకెక్కనున్న చిత్రానికి ఓకే చెప్పాడు.

నితిన్, నాని, నిఖిల్ తదితర హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు తన మిత్రుడు పి.జగన్ మోహన్ రావుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఎవరూ చెడ్డ కాదు. ఎవరూ మంచి కాదు. పరిస్థితుల ప్రభావంతోనే మంచివాళ్లుగా, చెడ్డవాళ్లుగా మారతారు అనే సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు సంతోష్‌ కుమార్‌ తెలిపారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు