శుభవార్త చెప్పిన స్టార్‌ జంట

6 Apr, 2020 15:51 IST|Sakshi

‘‘మేమిద్దరం కలిసి ప్రారంభించిన కొత్త ప్రాజెక్టు గురించి ప్రకటన చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. త్వరలోనే జూనియర్‌ కౌల్‌వ్యాస్‌ను పరిచయం చేయబోతున్నాం. ఈ ప్రాజెక్టు సృష్టికర్త, డైరెక్టర్లు, నిర్మాతలు సుమీత్‌ వ్యాస్‌, నేను’’అంటూ మోడల్‌, టీవీ నటి ఏక్తా కౌల్‌ అభిమానులతో శుభవార్త పంచుకున్నారు. త్వరలోనే తాను తల్లికాబోతున్నట్లు సోషల్‌ మీడియాలో వెల్లడించారు. ఈ క్రమంలో తన భర్త, నటుడు సుమిత్‌ వ్యాస్‌ తనను ఆత్మీయంగా హత్తుకున్న ఫొటోను జతచేశారు. దీంతో ఈ స్టార్‌ జంటకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన ఏక్తా పలు టీవీ సీరియళ్లలో కథానాయికగా నటించి బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటుడు, రచయిత సుమీత్‌ వ్యాస్‌ను ప్రేమించారు. 2018లో వీరిద్దరు కశ్మీరీ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇక సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ఏక్తా తరచుగా తన ఫొటోలను షేర్‌ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ఆమె భర్తతో కలిసి ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. అదే విధంగా కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతూ అభిమానుల్లో చైతన్యం నింపుతున్నారు.

Proudly announcing our new project together. 👶🏻👶🏻 Introducing Jr. KaulVyas (soon) Created, Directed and Produced by US.... @sumeetvyas and I 🙏🏻🙏🏻

A post shared by Ekta Rajinder Kaul (@ektakaul11) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా