‘అబ్బాయిలంటే ప్లాస్టిక్‌ కప్పా?’

12 Feb, 2020 17:59 IST|Sakshi

సందీప్‌ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్, సందీప్‌ కిషన్, దయా పన్నెం నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ తుది దశకు చేరుకోవడంతో మూవీ ప్రమోషన్లను ప్రారంభించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లతో ఈ చిత్రంపై పాజిటీవ్‌ వైబ్‌ క్రియేట్‌ అయింది. అంతేకాకుండా హాకీ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అందరిలోనూ అంచనాలు మొదలయ్యాయి. తాజాగా ప్రేమికుల రోజు కానుకగా సినిమాలోని ఫస్ట్‌ సాంగ్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ‘సింగిల్‌ కింగులం’ అంటూ సాగే ఈ పాట యూత్‌కు బాగా కనెక్ట్‌ అయింది. దీంతో సోషల్‌ మీడియాలో ఈ పాట వైరల్‌గా మారింది. 

ఈ పాటను హిప్‌ హాప్‌ తమిళ కంపోజ్‌ చేయగా.. రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించాడు. సామ్రాట్‌ లిరిక్స్‌ అందించిన ఈ పాటకు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించాడు. ‘అయ్యో పాపం చూడే పాపా.. నీ సొమ్మేంపోద్దే నునా చేప అబ్బాయిలంటే ప్లాస్టిక్‌ కప్పా? మా హీరో కన్నా నువ్వేం గొప్పా.. హేయ్‌ సింగిల్‌ కింగులం.. తెల్ల తెల్లాగున్న తాజ్‌మహల్‌కి రంగులేసి రచ్చ లేపే గబ్బర్‌ సింగులం మేమే సింగిల్‌ కింగులం’అంటూ సాగే పాట యూత్‌ను ముఖ్యంగా సింగిల్‌గా ఉన్నవారిని ఊర్రూతలూగిస్తోంది. రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణ మురళి, ప్రియదర్శి, సత్య, మహేష్ విట్టా, పార్వతీశం, అభిజిత్, భూపాల్, ఖయ్యూమ్, సుదర్శన్, శ్రీ రంజని, దయ, గురుస్వామి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. న్యూ ఏజ్‌ స్పోర్ట్స్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. 

చదవండి:
‘లూసిఫర్‌’ బాధ్యతలు సుకుమార్‌కు?

తల్లిదండ్రులకు సందీప్‌ కానుక

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాడినందుకు పైసా ఇవ్వ‌రు: ప్ర‌ముఖ‌ సింగ‌ర్‌

రష్మిక అంటే క్రష్‌ అంటున్న హీరో..

నిజంగానే గ‌డ్డి తిన్న స‌ల్మాన్‌

'శ్రియా.. ప్లీజ్‌ అతన్ని ఇబ్బంది పెట్టకు'

బన్నీపై కేరళ సీఎం ప్రశంసల వర్షం

సినిమా

పాడినందుకు పైసా ఇవ్వ‌రు: ప్ర‌ముఖ‌ సింగ‌ర్‌

రష్మిక అంటే క్రష్‌ అంటున్న హీరో..

నిజంగానే గ‌డ్డి తిన్న స‌ల్మాన్‌

ముకేష్‌పై శత్రుఘ్న సిన్హా ఘాటు వ్యాఖ్యలు

'శ్రియా.. ప్లీజ్‌ అతన్ని ఇబ్బంది పెట్టకు'

‘నా భర్త దగ్గర ఆ రహస్యం దాచాను’