ఏంది సార్ ఆ క‌రెంటు బిల్లు?: హీరో

30 Jun, 2020 19:56 IST|Sakshi

గ‌త కొద్ది రోజులుగా చిత్ర పరిశ్ర‌మ‌లో సెల‌బ్రిటీలకు క‌రెంట్ బిల్లులు చూసి క‌రెంట్ షాక్ కొడుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై సోష‌ల్ మీడియాలోనూ ఆగ్ర‌హావేశాలు వ్యక్త‌మవుతున్నాయి. మొన్న కార్తీ, నిన్న తాప్సీ,  నేడు హీరో సందీప్ కిష‌న్ కూడా వాచిపోతున్న‌ క‌రెంటు బిల్లుల‌ బాధితుల లిస్టులో చేరిపోయాడు. ఈ విష‌యాన్ని సందీప్ స్వ‌యంగా వెల్ల‌డించాడు. కానీ బిల్లు ఎంత వ‌చ్చింద‌న్న విష‌యాన్ని మాత్రం ప్ర‌స్తావించ‌లేదు. ఇక‌ ఎంతైనా సినిమా హీరో కాబ‌ట్టి సినిమా స్టైల్‌లోనే ఎల‌క్ట్రిసిటీ బిల్లుల గురించి మాట్లాడుతూ సెటైరిక‌ల్‌ పంచ్ ఇచ్చాడు. క‌రెంటు బిల్లులు కొత్త సినిమా వీకెండ్ క‌లెక్ష‌న్లలా ఉన్నాయన్నాడు. ()

"ఎల‌క్ట్రిసిటీ బోర్డ్ మీట‌ర్ చూస్తుంటే నా చిన్న‌త‌నంలో గిర్రున తిరిగే ఆటో రిక్షా మీట‌ర్ గుర్తొస్తుంది. ఏంది సార్ ఆ బిల్లు.. నెక్స్ట్ ఎవ‌రి ఇంటికి ఎక్కువ బిల్లు వ‌చ్చింద‌ని ఆన్‌లైన్ వార్ స్టార్ట్ అయినా ఆశ్చ‌ర్యం లేదు. ఎల‌క్ట్రిసిటీ బిల్లులు కొత్త సినిమాల వీకెండ్ క‌లెక్ష‌న్ల‌లా ఉన్నాయి" అంటూ సందీప్ ట్వీట్ చేశాడు. కాగా ఇప్ప‌టికే హీరోయిన్ కార్తీకా నాయ‌ర్‌కు ల‌క్ష రూపాయ‌ల బిల్లు రాగా తాప్సీకి 36,000 రూపాయల కరెంట్ బిల్లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. (తాప్సీకి కరెంట్‌ బిల్లు షాక్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు