‘90 ఎంఎల్‌’ సాంగ్‌కు చిందేసిన యువ హీరోలు

1 Dec, 2019 18:25 IST|Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘90 ఎం.ఎల్‌’. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ వేడుకకు అతిథిగా హాజరైన హీరో సందీప్‌ కిషన్‌, కార్తీకేయతో కలిసి చిందులేశారు.  90 ఎంఎల్‌ చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌కు సందీప్‌, కార్తికేయ ఫుల్‌ జోషుగా డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా, కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రవికిషన్, రావు రమేష్, అజయ్, ఆలీ, ప్రగతి, ప్రవీణ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. అనూప్‌ రూబెన్స్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కార్తికేయ క్రియేటివ్‌ వర్క్‌ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 5న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా