ఇండ్రు.. నేట్రు.. నాళై...

17 Mar, 2018 00:28 IST|Sakshi

... అర్థం కావడంలేదా? ఇవాళ, నిన్న, రేపు అని అర్థం. తమిళంలో ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ పేరుతో సందీప్‌ కిషన్‌ ఓ సినిమా చేయనున్నారని టాక్‌. తెలుగు సినిమాలతో పాటు సందీప్‌ తమిళ – తెలుగు బైలింగ్వల్‌ సినిమాలు కూడా చేస్తుంటారు. ఈసారి ‘ఇండ్రు నేట్రు నాళై’  అనే తమిళ చిత్రం తెలుగు రీమేక్‌లో నటించనున్నారట. సురేష్‌ బాబు, రాజ్‌ కందుకూరి నిర్మించనున్న ఈ సినిమా ద్వారా శ్రీరామ్‌ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారని సమాచారమ్‌. ఏప్రిల్‌ నెలాఖరున ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు