ఈ సినిమా నాకో పరీక్ష : సునీల్

31 May, 2015 23:30 IST|Sakshi
ఈ సినిమా నాకో పరీక్ష : సునీల్

 ‘‘వైవిధ్యమైన కథాకథనాలతో సాగే చిత్రం ఇది. ఈ సినిమా నాకొక  పరీక్ష లాంటింది’’ అని సునీల్ అన్నారు. ఆయన హీరోగా వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇది మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ అనీ,  సునీల్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా అవుతుందనీ దర్శకుడు అన్నారు. ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరాం, సంగీతం: దినేష్.