మరో యంగ్‌ హీరోతో సునీల్‌

19 May, 2018 10:56 IST|Sakshi

హీరోగా మారిన తరువాత సునీల్‌ కెరీర్‌ అంత ఆశాజనకంగా లేదు. మొదట్లో ఒకటి రెండు హిట్స్ వచ్చినా తరువాత వరుస ఫెయిల్యూర్స్‌ ఇబ్బంది పెట్టాయి. దీంతో తిరిగి కమెడియన్‌గా టర్న్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాడు సునీల్‌. అదే సమయంలో యంగ్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్‌ సినిమాలు చేసేందుకు ఓకె చెపుతున్నాడు.

ఇప్పటికే అల్లరి నరేష్‌ హీరోగా భీమినేని శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా మరో యంగ్ హీరోతో కలిసి నటించేందుకు అంగీకరించాడు సునీల్‌. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘పడి పడి లేచే మనసు’ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న  సినిమాలో కూడా సునీల్‌ నటించనున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా