ఇంట్లోనే పిక్నిక్ ప్లాన్ చేసిన స‌న్నీలియోన్‌

31 Mar, 2020 14:37 IST|Sakshi

లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇంటిప‌ట్టునే ఉన్న సెల‌బ్రిటీలు త‌మ క‌ళ‌ల‌కు ప‌దును పెడుతూ దొరికిన స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. బాలీవుడ్ భామ స‌న్నీలియోన్ త‌న ముగ్గురు పిల్ల‌ల‌ను ఎంట‌ర్‌టైన్ చేసేందుకు సిద్ధ‌మైంది. ఇందుకోసం వారిని ఏదో పిక్నిక్‌కు తీసుకెళుతున్న‌ట్లు రెడీ చేయించి బ‌య‌ట‌కు తీసుకొచ్చింది. అనంత‌రం జ‌స్టిన్ టింబ‌ర్‌లేక్ ఆల‌పించిన‌ పాట‌కు స‌న్నీ, ఆమె భ‌ర్త డేనియ‌ల్ వెబ‌ర్‌తో క‌లిసి స్టెప్పులేసింది. పిల్ల‌ల చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తూ వారిని సంతోష‌పెట్టింది. ఇది అటు పిల్ల‌ల‌తో పాటు అభిమానుల‌ను అల‌రిస్తోంది. ఈ డ్యాన్స్ వీడియోను స‌న్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో నోహా, అశేర్‌, నిషా ముగ్గురూ డ్యాన్స్‌కు ఊగిపోతూ చ‌ప్ప‌ట్లతో సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

అంతేకాక చేతులు ఊపుతూ  తాము కూడా డ్యాన్స్ చేసేందుకు ప్ర‌యత్నించారు. "చాలా రోజుల నుంచి నా పిల్లలు ఇంట్లోనే బందీకి గుర‌య్యారు.. అందుకే ఇలా.." అంటూ స‌న్నీ క్యాప్ష‌న్ జోడించింది. ప్ర‌భుత్వాలు స్వీయ నిర్బంధాన్ని ప్ర‌క‌టించిన తొలి రోజునుంచే ఆమె పిల్ల‌ల‌కు మాస్క్ ధ‌రించ‌డాన్ని నేర్పిస్తూ కోవిడ్-19 వ్యాప్తి అరిక‌ట్టేందుకు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు గ‌తంలోనూ కుటుంబం అంతా క‌లిసి మాస్క్ ధ‌రించిన ఫొటోను షేర్ చేసిన విష‌యం తెలిసిందే. కాగా సన్నీ నిషాను ద‌త్త‌త తీసుకోగా, స‌రోగ‌సి ద్వారా నోహా, అశేర్‌ అనే ఇద్ద‌రు మ‌గ క‌వ‌ల‌ల‌కు త‌ల్ల‌య్యారు. (మాస్క్‌ల శిక్షకు మొదటి రోజు: సన్నీలియోన్‌)

మరిన్ని వార్తలు