'సన్నీ ఎవర్నీ కొట్టలేదు'

25 Mar, 2016 18:58 IST|Sakshi
'సన్నీ ఎవర్నీ కొట్టలేదు'

హోలీ కార్యక్రమం కోసం వెళ్లిన మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ అక్కడ ఓ జర్నలిస్టును చెంపదెబ్బ కొట్టిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆమె భర్త డేనియల్ వెబర్ అంటున్నాడు. నేటి మధ్యాహ్నం తన భార్యపై వచ్చిన కథనాలపై తీవ్రంగా మండిపడ్డాడు. గతంలో మీరు పోర్న్ స్టార్.. ఇప్పుడు మీరు హీరోయిన్ అయిపోయారు కదా, మరి రాత్రి కార్యక్రమాలకు ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారని అడగడంతో పట్టలేని కోపం వచ్చిన సన్నీ వెంటనే టీవీ రిపోర్టర్ ను చెంపమీద కొట్టిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

టీవీ రిపోర్టర్ కు తన భార్య సరైన సమాధానం ఇచ్చిందని, కానీ అతడిని కొట్టిందని అనడంలో నిజం లేదని కొట్టిపారేశాడు వెబర్. ఆ జర్నలిస్టుపై మేం ఫిర్యాదు కూడా చేయలేదని చెప్పాడు. 'సన్నీలియోన్‌తో హోలీ' అనే ఈ కార్యక్రమ నిర్వాహకులలో కాలేజీ విద్యార్థులు ఉన్నారని వారి కెరీర్ కు ఆటంకం కలుగుతుందని భావించి వెనక్కి తగ్గామని సన్నీ లియోన్ భర్త వివరించాడు. ఈవెంట్ కు వెళ్లి, కార్యక్రమం ముగించుకుని వచ్చేశాం.. అక్కడ అంతకు మించి ఏం జరగలేదన్నాడు. ఇన్ని విషయాలు చెప్పుకొచ్చిన వెబర్ అసలు ఆ సమయంలో అక్కడ జర్నలిస్టులే లేరని చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు.