క్షమించు సుశాంత్‌: సన్నీ లియోన్‌

15 Jun, 2020 13:03 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌‌ ఆత్మహత్యపై శృంగార తార సన్నీలియోన్‌ స్పందించారు. ఈ మేరకు సోమవారం ట్విటర్‌లో భావోద్వేగపూరిత లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో ‘సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని వినగానే చాలా బాధపడ్డా. ఏం అనాలో.. ఏం రాయాలో అర్థంకాలేదు. ఎందుకంటే ఇంకొకరి గురించి ఇంతలా బాధపడటం నేను ఇది వరకు ఎరుగను.( దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నా). డిప్రెషన్‌ను ఎలా అధిగమించాలో, పాజిటివ్‌గా ఎలా ఉండాలో చాలా మంది ఇతరులకు సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ, మంచిని అన్వేషించటానికి, సంతోషంగా ఉండటానికి కొన్నిసార్లు చిరునవ్వు చిందించటం కష్టం.. నవ్వటం అసాధ్యం. అందరికీ ఇలాంటి భావాలు ఉంటాయి. కానీ కొంతమంది వీటినుంచి పక్కకు వెళ్లలేరు. ( సుశాంత్ ఫోటోలు షేర్‌.. పోలీసుల వార్నింగ్‌)

అన్నీ మర్చిపోయి ముందుకు సాగలేరు. కుటుంబం, మిత్రుల నుంచి సహాయం లేదా వృత్తిపరమైన సహాయం అవసరమైన వారికి.. పాజిటివ్‌గా ఉండండి అని చెప్పటం అంత మంచిది కాదు. క్షమించు సుశాంత్‌! ఈ ప్రపంచంపై పూర్తిగా నమ్మకం కోల్పోయి నువ్వీ నిర్ణయాన్ని తీసుకున్నావు. చావులోనైనా నువ్వు కోరుకున్న ఆనందాన్ని పొందావని అనుకుంటున్నాను. నువ్వు లేవన్న సత్యం నీ వారిని ఇక ఎప్పటికీ వేధిస్తూనే ఉంటుంది. నీ కుటుంబసభ్యులకు, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి. నీ ఆత్మకు శాంతి కలుగుగాక’అని పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు