థ్యాంక్యూ దేవుడా...బతికి బయటపడ్డాం!

4 Jun, 2017 01:57 IST|Sakshi
థ్యాంక్యూ దేవుడా...బతికి బయటపడ్డాం!

బుధవారం మహారాష్ట్రలోని లాతూర్‌ అనే స్మాల్‌ సిటీలో ఓ ఈవెంట్‌లో పాల్గొనడానికి శృంగారతార సన్నీ లియోన్, ఆమె భర్త డానియెల్‌ వెబర్‌ అండ్‌ టీమ్‌ ఫ్లైట్‌లో వెళ్లారు. వీళ్లు వెళ్లింది చిన్నా చితకా ఫ్లైట్‌లో కాదు... లార్జ్‌ ప్రయివేట్‌ జెట్‌లో వెళ్లారు. లాతూర్‌ చేరుకున్న తర్వాత ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది చావు కబురు చల్లగా చెప్పినట్టు... ‘వుయ్‌ ఆర్‌ సో సారీ సన్నీ! మా రన్‌వే అంత పెద్ద ఫ్లైట్‌ ల్యాండ్‌ కావడానికి చాలదు. స్మాల్‌ ఫ్లైట్స్‌కి మాత్రమే పర్మిషన్‌ ఉంది’ అన్నారు.

చేసేది ఏమీ లేక సన్నీ అండ్‌ కో గాల్లో ఉండగానే (ఫ్లైట్‌ ల్యాండ్‌ కాకుండానే) వెనుదిరిగారు. ముంబయ్‌కి రిటర్న్‌ వచ్చే టైమ్‌లో భారీ తుఫాను గాలుల్లో ఫ్లైట్‌ చిక్కుకుంది. దాంతో ఫ్లైట్‌లో జనాలకు హార్ట్‌ ఎటాక్‌ వచ్చినంత పనైందట! ఈ ఘటన గురించి సన్నీ లియోన్‌ మాట్లాడుతూ – ‘‘విపరీతమైన భయమేసింది. ఆల్మోస్ట్‌ ఫ్లైట్‌లో ప్రాణాలు పోతాయేమో! అన్నంతగా భయపడ్డాం. తుఫానులో ఫ్లైట్‌ చిక్కుకుంటుందని ఎవరూ ఊహించలేదు. పైలట్స్‌ ధైర్యంగా, సేఫ్‌గా ఫ్లైట్‌ను ల్యాండ్‌ చేశారు. నేల మీదకు దిగిన తర్వాత బతికి బయటపడినందుకు దేవుడికి థ్యాంక్స్‌ చెప్పుకున్నా’’ అన్నారు.