నేను ముద్దు పెట్టనని ఎవరన్నారు?

13 May, 2016 16:24 IST|Sakshi
నేను ముద్దు పెట్టనని ఎవరన్నారు?

పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ హాట్ హీరోయిన్ సన్నీ లియోన్ అభిమానులకు ఓ అరుదైన గిఫ్ట్ ఇచ్చింది. ఆమె కెమెరా ముందు ముద్దు సన్నివేశాల్లో నటించదన్న అభిప్రాయాన్ని ఇక అందరూ చెరిపేసుకునేలా.. ఒక ఘాటైన ముద్దు ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. శుక్రవారం నాడే 35 ఏళ్లు నిండిన సన్నీ.. తన భర్త డేనియల్ వెబర్‌కు ఘాటైన ముద్దు ఇచ్చి, ఆ ఫొటోను అందరికీ చూపించింది. ''నేను కెమెరా ముందు ముద్దు పెట్టనని ఎవరు చెప్పారు.. హెహే డేనియల్ వెబర్'' అని ఆ ఫొటోకు ఓ వ్యాఖ్య కూడా పెట్టింది. జిస్మ్ 2, రాగిణి ఎంఎంఎస్ 2, ఏక్ పహేలి లీలా, కుఛ్ కుఛ్ లోచా హై, మస్తీజాదే లాంటి ఎ రేటెడ్ సినిమాల్లో సన్నీ లియోన్ హాట్‌గా నటించిన విషయం తెలిసిందే.

తాజాగా ఆమె నటించిన 'వన్ నైట్ స్టాండ్' కూడా విడుదలైంది. మస్తీజాదే సినిమా తనకు చాలా ప్రత్యేకమని, తన అభిమానులు అంతా ఆ సినిమా పట్ల అపార ప్రేమాభిమానాలు కురిపించారని సన్నీ ఖుషీ ఖుషీగా చెప్పింది. ఆ సినిమాలో సన్నీ డబుల్ రోల్ పోషించిన విషయం తెలిసిందే. తన అభిమానులంతా ఈ సినిమాను ఎప్పుడు కావాలంటే అప్పుడు 'హంగామా ప్లే'లో చూసుకోవచ్చని.. ఇంతకంటే మంచి బర్త్‌డే గిఫ్టును తాను అడగలేనని సన్నీ చెప్పింది. ఈ అడల్ట్ కామెడీ సినిమాలో తుషార్ కపూర్, వీర్‌దాస్ ప్రధాన పాత్రలు పోషించారు.