వివిధ హావభావాల్లో సన్నీ లియోన్‌ ఎమోజీలు

3 Mar, 2017 21:08 IST|Sakshi
వివిధ హావభావాల్లో సన్నీ లియోన్‌ ఎమోజీలు

ముంబై :
బాలీవుడ్‌ శృంగార భామ సన్నీ లియోన్ తెగ సంబరపడుతోంది. లైలా మై లైలా అంటూ తొలిసారి 'రాయిస్‌'లో షారుఖ్‌తో కలిసి ఆడిపాడిన ఈ అమ్మడు తన అభిమానులకు మరోసారి కిక్కెకించడానికి రెడీ అయింది. అయితే ఈసారి సినిమాల్లో కాదు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యువతకు మరింత చేరవ అయ్యేలా, సన్నీ తన ఎమోజీలను విడుదల చేసింది. చాటింగ్‌ చేసే సమయంలో వివిధ హావభావాలను వ్యక్తపరచడానికి తరచుగా సోషల్‌ మీడియాలో ఎమోజీలను వాడుతారు.

ఎమోజీఫై యాప్‌లో సన్నీలియోన్‌ స్టిక్కర్స్‌ అందుబాటులోకి వచ్చాయి. తన ఎమోజీలు యాప్‌లో వచ్చాయని సన్నీ ఆనందం వ్యక్తం చేసింది. వెంటనే తన ఎమోజీలను ఫ్రీగా డౌన్‌లోడ్‌ చేసుకోని వాడుకునే అవకాశం ఉందని తెలిపింది. అంతే కాకుండా లింక్‌ను కూడా తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. కొన్ని ఎమోజీలను తన అకౌంట్‌లో పోస్ట్‌ చేయడమే కాకుండా తన ట్విట్టర్‌ అకౌంట్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌ను కూడా ఓ ఎమోజీని పెట్టేసింది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి