రంగీలా రమ్మంది

25 Jan, 2019 06:16 IST|Sakshi

దక్షిణాది చిత్రాలపై హాట్‌స్టార్‌ సన్నీ లియోన్‌ ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఆమె కొన్ని దక్షిణాది చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ చేసిన విషయం తెలిసిందే. గతేడాది హీరోయిన్‌గా తమిళంలో ‘వీరమాదేవి’ (తెలుగులో ‘వీరమహాదేవి’) అనే సినిమాకు సైన్‌ చేశారు సన్నీ. ఈ సినిమా తెలుగు, మలయాళంలో కూడా రిలీజ్‌ కానుంది. ఇప్పుడు ‘రంగీలా’ అనే చిత్రం సన్నీని కేరళకు రమ్మంది. ‘వీరమాదేవి’ అనువాద చిత్రం కాబట్టి ‘రంగీలా’ ఆమెకు మలయాళంలో డైరెక్ట్‌ చిత్రం అవుతుంది.

ఈ సినిమా గురించి ఇప్పుడు సన్నీనే అధికారికంగా ప్రకటించారు. ‘‘మలయాళ చిత్ర పరిశ్రమలోకి ‘రంగీలా’ అనే మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇవ్వబోతున్నానని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. సంతోష్‌ నాయర్‌ దర్శకత్వం వహిస్తారు. జయలాల్‌ మీనన్‌ నిర్మిస్తారు’’ అని సన్నీలియోన్‌ పేర్కొన్నారు.  మలయాళంలో మమ్ముట్టి హీరోగా రూపొందుతున్న ‘మధుర రాజా’ చిత్రంలోనూ సన్నీ ఓ ప్రత్యేక పాట చేయనున్నాట.

మరిన్ని వార్తలు