స్క్రీన్‌ టెస్ట్‌

23 Jan, 2018 05:36 IST|Sakshi

► ‘సాగరసంగమం’ చిత్రానికి మొదట అనుకున్న హీరోయిన్‌ ‘జయప్రద’ కాదు. మరి ముందు అనుకున్న కథానాయిక ఎవరో తెలుసా?
ఎ) రాధిక బి) జయసుధ సి) సుహాసిని డి) సుమలత

► నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడెవరు?
ఎ) బోయపాటి శ్రీను  బి) గౌతమ్‌ పట్నాయక్‌  సి) మేర్లపాక గాంధీ  డి) సురేందర్‌ రెడ్డి

► సన్నీ లియోన్‌ నటించిన మొదటి తెలుగు సినిమా హీరో  ఎవరో కనుక్కోండి?
ఎ) మంచు మనోజ్‌ బి) మంచు విష్ణు  సి) రాజశేఖర్‌    డి) రాజ్‌తరుణ్‌

► ఈ నాయికల్లో ఏ హీరోయిన్‌ రెండుసార్లు హీరో గోపీచంద్‌ సరసన నటించారు?
ఎ) రకుల్‌ప్రీత్‌ సింగ్‌   బి) తాప్సీ  సి) ప్రియమణి   డి) దీక్షాసేథ్‌

► రజనీకాంత్‌కు సూపర్‌స్టార్‌ అనే బిరుదు ఉందని అందరికీ తెలిసిన విషయమే. ఏ సినిమా నుండి స్క్రీన్‌పై ఈ టైటిల్‌ పడుతుందో తెలుసా?
ఎ) అన్నామలై బి) భాషా సి) వీర డి) బాబా

► చిరంజీవి నటించిన ఏ సినిమాలో బన్నీ (అల్లు అర్జున్‌) మెరుపులాంటి స్టెప్పులతో అలరించాడో తెలుసా?
ఎ) మాస్టర్‌    బి) డాడి సి) మృగరాజు  డి) బిగ్‌ బాస్‌

► నాని కెరీర్‌లో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఏది?
ఎ) మజ్ను    బి) పైసా సి) జెండాపై కపిరాజు డి) నిన్ను కోరి

► మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘అతడు’ సినిమాలో తాతగా నటించారు నాజర్‌. ఆ క్యారెక్టర్‌కు మొదట అనుకొన్నది ఒకప్పటి తెలుగు టాప్‌ హీరోని. ఈ హీరో ఎవరై ఉంటారు?
ఎ) అక్కినేని  బి) కృష్ణంరాజు  సి) కృష్ణ    డి) శోభన్‌బాబు

► ‘ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపేమున్నది...’ పాట ‘తోడికోడళ్లు’ సినిమాలోనిది. ఆ పాట చేసిన ప్రముఖ రచయిత?
ఎ) కొసరాజు   బి) కృష్ణశాస్త్రి    సి) దాశరథి   డి) ఆత్రేయ

► ‘మొగుడు పెళ్లాం ఓ దొంగోడు’ చిత్రం మొత్తం దాదాపు మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఆ మూడు పాత్రలలో మొగుడు పాత్రను హీరో రాజా, దొంగోడు పాత్రను బ్రహ్మానందం చేశారు. పెళ్లాం పాత్రను పోషించిన ప్రముఖ హీరోయిన్‌ ఎవరు?
ఎ) త్రిష బి) స్నేహ సి) నయనతార డి) శ్రియ

► యన్టీఆర్‌–కృష్ణ కాంబినేషన్‌లో చాలా సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా పేరేంటి?
ఎ) దేవుడు చేసిన మనుషులు బి) వయ్యారి భామలు వగలమారి భర్తలు సి) స్త్రీజన్మ డి) కృష్ణార్జునులు

► యన్టీఆర్‌ నటించిన ‘బృందావనం’ చిత్రంలో ఇద్దరు  నాయికలు ఉన్నారు. ఒకరు నటి సమంత... మరొకరెవరు?
ఎ) కాజల్‌ అగర్వాల్‌    బి) హన్సిక    సి) కార్తీక    డి) శ్రుతీహాసన్‌

► అక్కినేని కుటుంబం అందరూ కలిసి నటించిన ‘మనం’ చిత్రానికి కెమెరామేన్‌ ఎవరో కనుక్కోండి?
ఎ) పీసీ శ్రీరాం    బి) చోటా కె. నాయుడు  సి) సి. రామ్‌ప్రసాద్‌    డి) పీయస్‌ వినోద్‌

► 2017లో ‘రాజా ది గ్రేట్‌’ చిత్రం ద్వారా బాల నటుడిగా పరిచయం అయ్యారు సన్నాఫ్‌ హీరో రవితేజ. అతని పేరేంటో తెలుసా?
ఎ) ఉదయ్‌   బి) పృథ్వీ సి) మహాధన్‌   డి) మిఖైల్‌ గాంధీ

► మహేశ్‌బాబు నటిస్తున్న ‘భరత్‌ అనే నేను’ చిత్రానికి సంగీత దర్శకుడెవరో కనుక్కోంyì ?
ఎ) దేవిశ్రీ ప్రసాద్‌  బి) హారిస్‌ జయరాజ్‌సి) అనిరుథ్‌ డి) యస్‌.యస్‌. తమన్‌

► ‘ఏండి ఓ పాట పాడండే’ అంటూ హీరో ప్రభాస్‌ ఏ హీరోయిన్‌ని టీజ్‌ చేస్తాడు?
ఎ)  సంజన  బి) త్రిష సి) అనుష్క డి) రిచా గంగోపాధ్యాయ

► ‘ప్రేమ అనేది ఎవడికి వాడికి సెపరేట్‌ క్వశ్చన్‌ పేపర్, నీ ఆన్సర్‌ నాకు పనికి రాదు, నా ఆన్సర్‌ నీకు పనికి రాదు’ అనే డైలాగ్‌ను చెప్పిన హీరో ఎవరు? (చిన్న క్లూ: ఈ చిత్రానికి దర్శకుడు దశరథ్‌)
ఎ) నితిన్‌ బి) నాగార్జున సి) మంచు మనోజ్‌ డి) ప్రభాస్‌

► బాలీవుడ్‌ భామ కంగనా రనౌత్‌ను తెలుగు లె రకు  పరిచయం చేసిన దర్శకుడెవరు?
ఎ) రాజమౌళి  బి) వినాయక్‌  సి) రామ్‌గోపాల్‌ వర్మ  డి) పూరి జగన్నాథ్‌

► కృష్ణంరాజు, వాణిశ్రీ  కలిసి నటించిన ఈ స్టిల్‌  ఏ సినిమాలోనిది?
ఎ) జీవనతీరాలు   బి) వినాయక విజయంసి) మనుషుల్లో దేవుడుడి) భక్త కన్నప్ప

► పై ఫొటోలో ముద్దుగా బొద్దుగా ఉన్న ఒకప్పట స్టార్‌ హీరోయిన్‌?
ఎ) మీనా  బి) రాశిసి) రాధిక  4) నిరోషా

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) బి  2) బి  3) ఎ  4) బి5) ఎ  6) బి 7) సి  8) డి9) ఎ   10) డి  11) సి12) ఎ  13) డి  14) సి15) ఎ  16) బి  17) సి  18) డి  19) డి  20) ఎ

మరిన్ని వార్తలు