సన్నీలియోన్‌ని భయపెట్టిన పాము

26 Nov, 2017 17:05 IST|Sakshi

సాక్షి, ముంబై : ఏదైనా సంఘటన జరిగినప్పుడు.. నేనప్పుడు అక్కడ ఉండి ఉంటే.. మరోలా ఉండేదనే మాట మనం చాలామంది వింటుంటాం. పాము మన పక్కన వెళుతుంటే..? ఇంకా ప్రమాదకరమైన పరిస్థితులు మన వెనుక ఉంటే? మనం ఎలా రియాక్ట్‌ అవుతాం? అనే ప్రశ్నలకు సన్నీ లియోన్‌ పరిస్థితే నిదర్శనం.


బాలీవుడ్‌లో హాట్‌ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్‌ ఒక షూటింగ్‌ విరామంలో స్క్రిప్ట్‌ చదువుకుంటూ కూర్చుంది. ఇంతలో అక్కడే ఉన్న ఒక వ్యక్తి రబ్బర్‌ పామును వెనకనుంచి తీసుకువచ్చి.. సన్నీ లియోన్‌ మీద వదిలాడు. అంతే ఒక్కసారిగా కంగారుపడ్డ సన్నీ... కుర్చీలోంచి ఒక్క గెంతుతో ఎగిరి.. అటునుంచి పారిపోయింది. అక్కడే ఉన్న మరో వ్యక్తి సన్నీ రియాక్షన్స్‌ను వీడియో తీసి.. తరువాత ట్విటర్‌లో పోస్ట్ చేశారు.


తరువాత ఈ ఘటనపై సన్నీ లియోన్‌ కూడా సరదాగా స్పందించారు. పామంటే ఎవరికి భయముండదు చెప్పడంటూ వ్యాఖ్యానించింది. అప్పడు భయమేసినా.. వీడియో చూస్తుంటూ నాకే సరదాగా అనిపిస్తోందపి ఆమె అన్నారు.

>
మరిన్ని వార్తలు