తిరుగులేని సన్నీలియోన్‌, మళ్లీ..

3 Dec, 2019 12:36 IST|Sakshi

భారత్‌లో ఈ యేడాది ఎక్కువ మంది జనాలు శృంగార తార సన్నీలియోన్‌ కోసం తెగ సెర్చ్‌ చేశారట. దీంతో మరోసారి అందరినీ వెనక్కి నెట్టి సన్నీ టాప్‌ ప్లేస్‌ దక్కించుకుంది. తాజాగా యాహూ నివేదికలో వెల్లడించిన అంశాల ప్రకారం.. యాహూ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ సెలబ్రిటీ–2019గా సన్నీలియోన్‌తో పాటు బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ నిలిచారు. సల్మాన్‌ఖాన్‌ తర్వాత బాలీవుడ్‌ హీరోలు అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌ కుమార్‌ కోసం నెటిజన్లు ఆన్‌లైన్‌లో గాలించారు. మరోవైపు బాలీవుడ్‌ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకునేలను వెనక్కు నెట్టి సన్నీలియోన్‌ టాప్‌ ప్లేస్‌ దక్కించుకుంది. 2016, 2017లోనూ సన్నీ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది.  

తిరుగులేని దంగల్‌..
గడిచిన దశాబ్ధ కాలంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అమీర్‌ఖాన్‌ దంగల్‌ రూ.2వేల కోట్ల వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది. సల్మాన్‌ ఖాన్‌ ‘భజరంగీ భాయ్‌జాన్‌’, అమీర్‌ఖాన్‌ ‘పీకే’ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటి తర్వాత సుల్తాన్‌, టైగర్‌ జిందగీ హై, ధూమ్‌3, సంజు, వార్‌, చెన్నై ఎక్స్‌ప్రెస్‌, దబాంగ్‌ టాప్‌ టెన్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో చోటు సాధించుకున్నాయి. ఈ యేడాది మేల్‌ స్టైల్‌ ఐకాన్‌గా బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ నిలిచారు. మహిళా స్టైల్‌ ఐకాన్‌గా ముక్కుసూటిగా మాట్లాడే నటి సారా అలీ ఖాన్‌ ఉన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా