చప్పదనమే చక్కదనం!

17 Oct, 2016 22:52 IST|Sakshi
చప్పదనమే చక్కదనం!

సన్నీ లియోన్ జీవితం చాలా చప్పగా సాగుతోందట. డాక్టర్ సలహా మేరకు తనకు ఇష్టమైన ఆహార పదార్థాలను దూరం పెట్టాల్సి వస్తోందంటున్నారీ బ్యూటీ. విషయం ఏంటంటే... సన్నీకి ఏదో ‘ఇన్‌ఫెక్షన్’ సోకిందట. డాక్టర్ దగ్గరికెళితే.. ఆయన పచ్చి శాకాహార నియమాలను విధించి, మాంసాహారాన్ని కొన్నాళ్లపాటైనా మరిపోవాలని చెప్పారట.
 
ఆ విషయం గురించి సన్నీ లియోన్ మాట్లాడుతూ -
‘‘మంచి కాఫీతో నా డే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దానికి బదులు రుచి లేని ఓ టీని బలవంతంగా తాగాల్సి వస్తోంది. నా చైనీస్ డాక్టర్ ‘ఆల్కహాల్.. కెఫీన్... మీట్.. స్పైసీ ఫుడ్’ తీసుకోకూడదని చెప్పేశారు. పాల ఉత్పత్తులేవీ తీసుకోకూడదన్నారు. సో.. నేను ‘వేగన్’ (మూగజీవాల నుంచి వచ్చే దేన్నీ ఆహారంగా తీసుకోకపోవడం) గా మారిపోయా. సంప్రదాయబద్ధంగా తయారు చేసే చైనీస్ మందుల మీద నాకు నమ్మకం ఎక్కువ. ఒకవేళ నేను వేగన్‌గా మారిపోవాలన్నది ఆ దైవనిర్ణయం అయ్యుండొచ్చు. అందుకే నా డాక్టర్ ద్వారా చెప్పించి ఉంటాడు. కాఫీ తాగడం లేదనే కొరత తప్ప మిగతాదంతా బాగానే ఉంది’’ అని వివరించారు. అన్నట్లు... జీవితం చప్పగా ఉన్నా, చక్కగా ఆరోగ్యంగా ఉందని లియోన్ నవ్వుతూ అంటున్నారు.