భర్తకి స్వీట్‌ విషెస్‌ చెప్పిన సన్నీ

11 Apr, 2018 16:57 IST|Sakshi

ఒకప్పుడు పోర్న్‌ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన సన్నీలియోన్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ నటిగా ప్రయాణం కొనసాగిస్తుంది. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు ఆమె తన సహనటుడు డానియల్‌ వెబర్‌ని వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిచారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సన్నీ బుధవారం తమ వివాహ వార్షికోవత్సం సందర్భంగా ట్విటర్‌ వేదికగా భర్త వెబర్‌కి స్వీట్‌ విషెస్‌ తెలిపారు.

‘ఏడేళ్ల కిందట దేవుడి సన్నిధిలో ఒక్కటయ్యాం. ఎప్పుడూ ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడుతూనే ఉన్నాం. పెళ్లి నాటి కన్నా ఇప్పుడు నిన్ను అమితంగా ఇష్టపడుతున్నాను. చివరివరకు ఇలాంటి జీవితమే కొనసాగిద్దాం. లవ్‌ యూ వెబర్‌, హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ’  అంటూ తమ పెళ్లి నాటి ఫొటోని ట్వీట్‌ చేశారు సన్నీ.

ప్రస్తుతం ఈ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. అందులో నిషా వెబర్‌ని ఏడాది క్రితం ఈ జంట దత్తత తీసుకుంది. గత నెల మార్చిలో సన్నీ సరోగసి ద్వారా మగ కవలలకు జన్మనిచ్చింది. వీరికి అపెర్‌ సింగ్‌ వెబర్‌, నోహ్‌ సింగ్‌ వెబర్‌గా పేర్లు పెట్టారు. చివరిసారిగా తెరా ఇంతిజార్‌ సినిమాలో కనిపించిన సన్నీ, ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టడానికి యత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు