జోడీ కుదిరింది

16 Nov, 2019 04:23 IST|Sakshi

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘సూపర్‌మచ్చి’. పులివాసు దర్శకత్వంలో రిజ్వాన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు కన్నడ బ్యూటీ రచితారామ్‌ను ఎంపిక చేసుకున్నట్లు శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ఈ నెల 22న ప్రారంభం కానుంది. రాజేంద్రప్రసాద్, వీకే నరేశ్, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: శ్యామ్‌ కె. నాయుడు, సహ–నిర్మాత ఖుషి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు