ఆడిషన్స్‌లో ‘సూపర్ మామ్స్ సీజన్ 2’

30 Oct, 2014 22:39 IST|Sakshi

గత ఏడాది ప్రసారమైన ‘డాన్స్ ఇండియా డాన్స్ (డి.ఐ.డి)-సూపర్ మామ్స్’కి కొనసాగింపుగా జీ టీవీలో సీజన్ 2 ఆరంభం కానుంది. డాన్స్ పట్ల ఆసక్తి ఉండి, దాన్ని ప్రదర్శించుకోవడానికి సరైన వేదిక దొరకని ప్రతి తల్లీ ఈ షోను సద్వినియోగం చేసుకోవచ్చని జీ టీవీ ప్రతినిధి తెలిపారు. ఈ షోలో పాల్గొనాలనుకున్న వాళ్లు ఆడిషన్స్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. మొత్తం 16 నగరాల్లో ఆడిషన్స్ చేస్తున్నారు. నవంబర్ 2న హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో గల నందినీ హైస్కూల్‌లో ఆడిషన్స్ జరుగుతాయనీ, 18 ఏళ్లు, అంతకన్నా పైబడిన వారు ఆడిషన్స్‌కు రావచ్చని తెలిపారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి