ఎత్తులు పై ఎత్తులతో స్కెచ్‌

21 Jun, 2018 00:51 IST|Sakshi

‘‘ది ఎండ్, సామాన్యుడు’ సినిమాలతో దర్శకుడిగా రవి చావలి తనను తాను ప్రూవ్‌ చేసుకున్నారు. ఆ రెండు సినిమాలు నాకు ఇష్టం. ‘సూపర్‌ స్కెచ్‌’ కూడా వాటికి మించి పెద్ద హిట్‌ అవ్వాలి. కొత్త నటీనటులందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఆడియో మంచి సక్సెస్‌ కావాలి’’ అని దర్శకుడు సురేందర్‌ రెడ్డి అన్నారు. నర్సింగ్‌ మక్కల హీరోగా, ఇంద్ర, సమీర్‌ దత్త, కార్తీక్‌ రెడ్డి, చక్రి మాగంటి, సోఫియా సింగ్, గ్యారీ ట్యాన్‌ టోనీ, అనికా రావు, సుభాంగి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సూపర్‌ స్కెచ్‌’. రవి చావలి దర్శకత్వంలో బలరామ్‌ మక్కల, ఎ.పద్మనాభరెడ్డి నిర్మించారు.

కార్తీక్‌ కొడకండ్ల స్వరపరచిన ఈ చిత్రం పాటలను సురేందర్‌ రెడ్డి విడుదల చేశారు. రవి చావలి మాట్లాడుతూ– ‘‘డ్రగ్స్‌కి బానిసలైన నలుగురు తెలివైన క్రిమినల్స్‌ అందరి దగ్గర మంచివాళ్లలా నటిస్తూ పోలీసులకు చెమటలు పట్టిస్తుంటారు. వారికి రాజకీయంగా సపోర్ట్‌ ఉండటంతో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. కానీ, నిజాయతీ గల పోలీస్‌ ఆఫీసర్‌ నాయక్‌ వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారిని ఎలా అరెస్ట్‌ చేశాడనేది ఆసక్తికరం. ఈ నెల 29న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘తెలంగాణలో బతుకమ్మ, బోనాలు పెద్ద పండుగలు. ఈ నెల 29న తెలంగాణ డైలాగుల పండుగ మా సినిమాతో రానుంది’’ అన్నారు నర్సింగ్‌ మక్కల. ‘‘మా సినిమా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత పద్మనాభరెడ్డి. 

మరిన్ని వార్తలు