‘సరిలేరు నీకెవ్వరు’ గురించి కృష్ణ..

31 Jan, 2020 16:01 IST|Sakshi

తన కుమారుడు మహేష్‌బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా గురించి సూపర్‌ కృష్ణ స్పందించారు. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దర్శక, నిర్మాతలు ‘ బ్లాక్‌ బస్టర్‌ కా బాప్‌’ అని హెడ్డింగ్‌ పెట్టి ప్రచారం చేయడం బాగుందన్నారు. ఈ సినిమా ఇంకా మరికొన్ని రోజులు ఆడుతుందని, మరిన్ని వసూళ్లు సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు’  సినిమా చాలా బాగుందని, నిర్మాతలు రాజీలేకుంగా నిర్మించారని మెచ్చుకున్నారు. ఎక్కడా బోరు కొట్టకుండా సినిమాను దర్శకుడు అనిల్‌ రవిపూడి తెరకెక్కించారని కృష్ణ ప్రశంసించారు.

తన తండ్రి మాటలపై మహేష్‌బాబు స్పందిస్తూ.. ‘థ్యాంక్యూ మై సూపర్‌స్టార్‌.. సరిలేరు నీకెవ్వరు’ అంటూ ట్వీట్‌ చేశారు. తమ సినిమాను సూపర్‌ స్టార్‌ మెచ్చుకోవడం పట్ల నిర్మాత అనిల్‌ సుంకర సంతోషం వ్యక్తం చేశారు. మూడు తరాలు కలిసి నటించే సినిమా కోసం ఎదురు చూస్తున్నామని ఆయన ట్వీట్‌ చేశారు. జనవరి 11న విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద నిలబడి మంచి వసూళ్లు రాబట్టింది. (చదవండి: సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు