రాజకీయాల్లోకి మహేష్‌ బాబు?

4 Sep, 2019 15:28 IST|Sakshi

భరత్‌ అనే నేను సినిమాలో యంగ్ సీఎంగా అదరగొట్టిన సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు నిజంగానే పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడా..? హీరోగా తిరుగులేని మాస్‌ ఫాలోయింగ్‌ను సాధించిన సూపర్‌ స్టార్‌ పాలిటిక్స్‌లోనూ సత్తా చూపేందుకు రెడీ అవుతున్నారా..? ప్రస్తుతం జాతీయ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. మహేష్‌, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండగా.. మహేష్‌ త్వరలో రాజకీయ ప్రవేశం చేయనున్నారని! వార్తలు మీడియా సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

అయితే ఈ ప్రచారం కొత్తదేమీ కాదు. గతంలోనూ మహేష్ పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరగింది. అప్పట్లో ఈ వార్తలపై స్పదించిన మహేష్‌ వాటిని కొట్టిపారేశారు. ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని, తాను నటన తప్ప వేరే ఏది చేయనని కుండ బద్దలు కొట్టేశారు. అదే సమయంలో ఓ ఇంటర్యూలో మహేష్‌ బాబు మాట్లాడుతూ ‘చిన్నప్పటినుంచే నాకు నటన అంటే ఇష్టం.. షూటింగ్‌ కోసం స్కూల్‌ ఎగ్గోట్టేవాడిని, ఎగ‍్జామ్స్‌లో ఫెయిల్‌ అయ్యి ఒక ఏడాది వృదా కావటంతో.. నాన్నగారు(సూపర్‌ స్టార్‌ కృష్ణ) నటనకు బ్రేక్‌ ఇచ్చి చదువు పూర్తి చేయమన్నా’రు. దాంతో నేను మళ్లీ స్కూల్‌కి వెళ్లాల్సి వచ్చిందని ప్రిన్స్‌ చెప్పుకొచ్చాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో సీనియర్‌ నటి విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ  సినిమాని విడుదల చేయనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు