రజనీ కొత్త సినిమా టైటిల్‌ ఇదే

24 Feb, 2020 20:36 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కొత్త సినిమా షూటింగ్‌ ప్రాంరంభమైంది. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తుండగా శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూ, ప్రకాశ్‌రాజ్‌, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తలైవార్‌కి ఇది 168 చిత్రం కావడం విశేషం. ఎంతిరన్‌, పేట వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్ల తర్వాత సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. తాజాగా చిత్ర బృందం రజనీ 168 సినిమాకు ‘అన్నాతే’ అనే టైటిల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు టైటిల్‌ వీడియోను సన్‌ పిక్చర్స్‌ సంస్థ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. అయితే ఈ చిత్రంలో సీనియర్‌ నటి మీనా ప్రత్యేక పాత్రలో  కనిపిస్తున్నారు. ఇక రజనీ- మీనా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ముత్తు’ సినిమా హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.


ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ దర్శకతంలో రజనీ నటించిన ‘దర్బార్‌’ సంక్రాంతి బరితో దిగి సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించారు.  నివేదా థామస్‌, సునీల్‌ శెట్టి, మోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. దర్బార్‌ లైకా ప్రొడక‌్షన్‌ తెరకెక్కించిన విషయం తెలిసిందే. దర్బార్‌లో రజనీ శక్తివంతమైన పోలీసు ఆఫీసర్‌ పాత్రలో కనిపించిన సంగతి విదితమే. 
 

మరిన్ని వార్తలు