కన్నడ చిత్రానికి అమీర్ ప్రశంసలు

30 May, 2016 19:51 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ జాతీయ స్థాయిలో ఉత్త‌మ చిత్రంగా ఎంపికైన కన్నత చిత్రం 'థిథి'పై ప్రశంసంలు కురిపించారు. చాలా కాలం తర్వాత ఓ అద్భుతమైన చిత్రాన్ని చూశానంటూ ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ చిత్ర నటీనటులను అమీర్ పొగడ్తలతో ముంచెత్తారు. ఆ చిత్రంలో ప్రముఖ నటులు లేకపోయినా... కొత్తవారి నటన మాత్రం అద్భుతమని కొనియాడారు. కర్ణాటకలోని ఓ గ్రామంలో సెంచరీ కొట్టి జీవితం సాగిస్తున్న  సెంచరీ గౌడ అనే వ్యక్తి మరణంపై మూడు తరాలకు చెందిన వాళ్లు ఎలా స్పందిస్తారు, అతడు మరణించిన 11 రోజులకు అంత్యక్రియలు చేయడం అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

జనరేషన్లో వస్తున్న మార్పులు, వారి ఆలోచనా విధానాలు చూస్తుంటే కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ సినిమా మాత్రం ఫన్నీగా ఉందని...డోంట్ మిస్ అని అమీర్ ఖాన్ పేర్కొన్నారు. థిథి చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డును అందుకోవటమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో 12 అవార్డులను కైవసం చేసుకుంది. ఈ చిత్రం ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో జూన్ 3న విడుదలకు సిద్ధంగా ఉంది. థిథి చిత్రాన్ని ప్రతాప్ రెడ్డి నిర్మించారు.