ప్రత్యేక పూజలు చేయడంలేదు

13 Mar, 2018 00:06 IST|Sakshi
ధర్మశాలలో రజనీకాంత్‌కి స్వాగతం పలుకుతున్న దృశ్యం

రజనీకాంత్‌ ఆధ్యాత్మిక యాత్ర శనివారం మొదలైంది. వారం పది రోజులపాటు సాగే ఈ ట్రిప్‌లో రజనీ పలు దేవాలయాలను సందర్శించి, ధ్యానం చేసి, ‘యోగాద సత్సంగ సొసైటీ ఆఫ్‌ ఇండియా’ వందేళ్ల వేడుకల్లో పాల్గొని చెన్నై చేరుకుంటారు. ‘‘ఇటీవల పొలిటికల్‌ జర్నీ స్టార్ట్‌ చేశాను. ఆ ప్రయాణం కోసం ఈ ప్రయాణం (ఆధ్యాత్మిక యాత్ర)లో ప్రత్యేక పూజలు చేయాలనుకోవడంలేదు.

ఎప్పటిలానే ఇది కూడా ఓ స్పిరిచ్యువల్‌ జర్నీ అంతే’’ అని రజనీ పేర్కొన్నారు. ముందు ధర్మశాల వెళ్లిన రజనీకి ఘనస్వాగతం లభించింది. అక్కడి శివాలయాన్ని దర్శించారాయన. ఆ తర్వాత రిషికేష్‌ వెళ్లడానికి ప్లాన్‌ చేసుకున్నారు. అనంతరం హిమాచల్‌ ప్రదేశ్‌లో 1917లో పరమహంస యోగానంద ప్రారంభించిన ‘యోగాద సత్సంగ సొసైటీ’ (వైఎస్‌ఎస్‌) వందేళ్ల వేడుకల్లో పాల్గొంటారు.
 

>
మరిన్ని వార్తలు