రజనీ నెక్ట్స్‌ సినిమాకు డైరెక్టర్‌ ఫిక్స్‌!

20 Aug, 2019 14:17 IST|Sakshi

వయసు పెరుగుతున్న కొద్ది సూపర్‌ స్టార్ కొత్త ఎనర్జీతో దూసుకుపోతున్నాడు. గతంలో సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ నుంచి ఏడాదికి ఒక్క సినిమా రావటమే గగనంగా అనిపించేది. రజనీ మూడేళ్ల పాడు గ్యాప్‌ తీసుకున్న సందర్భం కూడా ఉంది. కానీ ఇటీవల ఈ టాప్‌ స్టార్ స్పీడు పెంచారు. వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. గత ఏడాది కాలా, 2.ఓ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన రజనీ ఈ ఏడాది జనవరిలో పేట సినిమాతో పలకరించారు.

తరువాత ఏ మాత్రం గ్యాప్‌ తీసుకోకుండా మురుగదాస్‌ దర్శకత్వంలో దర్బార్‌ సినిమాను ప్రారంభించారు. ప్రస్తుతం దర్బార్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న రజనీ తదుపరి చిత్రాన్ని కూడా ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది. మాస్‌ యాక్షన్‌ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో రజనీ సినిమా చేయబోతున్నారట.

అజిత్ హీరోగా వరుసగా నాలుగు సినిమాలు రూపొందించిన శివ, ఇటీవల సూర్య హీరోగా సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే రజనీతో సినిమాకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను ధనుష్‌ లేదా కలైపులి యస్‌. థానులలో ఒకరు నిర్మించనున్నారట. అయితే ఈ లోగా అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైతే రజనీ సినిమాలన్ని ఆగిపోతాయన్న టాక్‌ కూడా వినిపిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సైరా.. చరిత్రలో కనుమరుగైన వీరుడి కథ

సాహో : ప్రభాస్‌ సింగిలా.. డబులా?

ఒకే రోజు పది సినిమాల రిలీజ్‌!

‘నా జీవితానికి శక్తినిచ్చిన ‘రాక్షసుడు’’

హర్రర్‌ సినిమాతో మాలీవుడ్‌కి!

మహేష్‌ సినిమాను పక్కన పెట్టిన దర్శకుడు!

బాలయ్య కొత్త సినిమా లుక్‌!

టాలీవుడ్‌ యంగ్‌ హీరోకు ప్రమాదం..!

కొత్త జోడీ

ప్రేమలో పడితే..!

మా సభ్యులకు అవకాశాలివ్వాలి

తొమ్మిది గంటల్లో...

సంక్రాంతి బరిలో మంచోడు

కాంబినేషన్‌ రిపీట్‌

ఫొటోలతోనే నా పబ్లిసిటీ నడిచింది

థ్రిల్లర్‌కి సై

ఐరన్‌ లెగ్‌ ముద్ర వేశారు

మైదానంలో దిగారు

కన్నీరు పెట్టిన బాబా.. ఓదార్చిన శ్రీముఖి

ఓన్లీ వన్స్‌ ఫసక్‌..

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

హ్యాట్రిక్‌ కొట్టేశాడు : బన్నీ

వైరల్‌ అవుతున్న ప్రభాస్‌, జాక్వెలిన్‌ స్టెప్పులు

ఆకట్టుకుంటోన్న ‘కౌసల్య కృష్ణమూర్తి’ ట్రైలర్‌

అది డ్రగ్‌ పార్టీ కాదు..

‘తూనీగ’ ట్రైల‌ర్ విడుద‌ల

అనుష‍్క బికిని ఫోటో.. కోహ్లి కామెంట్‌

‘సైరా’కు పవన్‌ వాయిస్‌ ఓవర్‌; వీడియో

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఒకే రోజు పది సినిమాల రిలీజ్‌!

మహేష్‌ సినిమాను పక్కన పెట్టిన దర్శకుడు!

‘నా జీవితానికి శక్తినిచ్చిన ‘రాక్షసుడు’’

హర్రర్‌ సినిమాతో మాలీవుడ్‌కి!

టాలీవుడ్‌ యంగ్‌ హీరోకు ప్రమాదం..!

కొత్త జోడీ