‘హవా సింగ్‌’ ఫస్ట్‌ లుక్‌

5 Feb, 2020 07:43 IST|Sakshi

బాక్సర్‌గా రింగ్‌లో పంచ్‌లు ఇవ్వడానికి ఫుల్‌గా పాలు తెగి రెడీ అవుతున్నారు బాలీవుడ్‌ యువ హీరో సూరజ్‌ పంచోలి. ఇదంతా సూరజ్‌ హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘హవా సింగ్‌’ కోసమే. ప్రకాష్‌ నంబియార్‌ దర్శకత్వంలో కమ్‌లేష్‌ సింగ్, సామ్స్‌ ఫెర్నాండెజ్‌ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ‘హవా సింగ్‌’ సినిమా ఫస్ట్‌ లుక్‌ను బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ విడుదల చేశారు.

2015లో సల్మాన్‌ ఓ నిర్మాతగా వ్యవహరించిన హిందీ చిత్రం ‘హీరో’తోనే సూరజ్‌ సినీ ప్రస్థానం మొదలైన సంగతి తెలిసిందే. ఇక.. æహవా సింగ్‌ విషయానికి వస్తే.. ఆయన హర్యానాకి చెందిన బాక్సర్‌. ఇండియన్‌ హెవీ వెయిట్‌ బాక్సర్‌గా ఆసియన్‌ గేమ్స్‌ (1966, 1970)లో గోల్డ్‌ మెడల్స్‌ సాధించారు. అంతేకాదు.. హెవీ వెయిట్‌ క్యాటగిరీలో పదకొండుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించారు.  ‘‘హవా సింగ్‌’ బయోపిక్‌లో నటించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు సూరజ్‌.

మరిన్ని వార్తలు