రానా పెళ్లిపై సురేష్‌ బాబు క్లారిటీ

13 May, 2020 14:22 IST|Sakshi

సోషల్ మీడియా వేదికగా తన ప్రేమ విషయాన్ని వెల్లడించిన హీరో రానా చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. హైదరాబాద్‌కు చెందిన మిహీక బజాజ్‌ను ప్రేమిస్తున్నానని.. ఆమె ఒకే చెప్పిందని రానా ప్రకటించారు. దీంతో టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌గా ఉన్న రానా.. ఓ ఇంటివాడు కాబోతుండటంతో పలువురు సినీ ప్రముఖులు రానాకు శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా రానా ప్రేమ, పెళ్లిపై ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు స్పందించారు. బాంబే టైమ్స్‌తో మాట్లాడిన సురేష్‌ బాబు... రానా నిశ్చితార్థం గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాదిలోనే రానా పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. (చదవండి : రానా ప్రేయసి మిహీకా వివరాలు ఇవే..)

‘రానా, మిహీకాలు చాలా కాలంగా ఒకరికొకరు తెలుసు. వారిద్దరు ఒకటి కావాలని నిర్ణయం తీసుకోవడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలను సరైన సమయంలో వెల్లడిస్తాం. ఈ ఏడాదిలోనే వారి పెళ్లి జరుగుతుంది. డిసెంబర్‌లో పెళ్లి చేయాలని మేము అనుకుంటున్నాం.. కానీ అంతకు ముందే జరిగే అవకాశం కూడా ఉంది. అన్ని ఖరారు అయ్యాక వివరాలు వెల్లడిస్తాం. ఈ లాక్‌డౌన్‌ సమయంలో మేము ఖాళీగా ఉండకుండా.. పిల్లలు మాకు పని కల్పించారు. మేము ఇప్పుడు పెళ్లికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాం’ అని సురేష్‌ బాబు తెలిపారు. మరోవైపు రానా, మిహీకా కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్టు బాంబే టైమ్స్‌ పేర్కొంది. (చదవండి : ఆమె యస్‌ చెప్పింది  : రానా)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా