సురేష్‌ గోపి @ 250

24 May, 2020 06:15 IST|Sakshi
సురేష్‌ గోపి

ప్రముఖ మలయాళ నటుడు సురేష్‌ గోపి త్వరలోనే ఓ కొత్త మైలు రాయిని అందుకోబోతున్నారు. నటుడిగా 247 సినిమాల వరకూ చేశారాయన. 248, 249వ íసినిమాలకు ప్లానింగ్‌ జరిగిపోయింది. తాజాగా 250వ చిత్రం కూడా అంగీకరించారు. ఈ స్పెషల్‌ సినిమా మరింత స్పెషల్‌గా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సురేష్‌ గోపి మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. మాథ్యువ్‌ థామస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. లాక్‌ డౌన్‌ తర్వాత ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు