సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌?

11 Aug, 2019 10:11 IST|Sakshi

సూపర్‌హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ కానుందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే బదులే వస్తోంది. నటుడు సూర్య, దర్శకుడు హరి కాంబినేషన్‌లో ఇంతకుముందు ఆరు, వేల్, సింగం 1,2,3 సీక్వెల్స్‌ వచ్చాయి. వాటిలో సింగం 3 చిత్రం మినహా అన్నీ హిట్‌ అయ్యాయి. కాగా వీర్దిరూ కలిసి మరో చిత్రం చేయబోతున్నారని సమాచారం.

సూర్య నటించిన ఎన్‌జీకే చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. కాగా ప్రస్తుతం ఆయన కేవీ. ఆనంద్‌ దర్శకత్వంలో కాప్పాన్‌ చిత్రాన్ని పూర్తి చేశారు. నటి సాయేషా సైగల్‌ నాయకిగా నటించిన ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్, ఆర్య వంటి ప్రముఖ నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. చిత్రాన్ని సెప్టెంబర్‌ 20న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు.

సూర్య ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో సూరరై పోట్రు చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకుడు జీఆర్‌.గోపీనాథ్‌ బయోపిక్‌తో తెరకెక్కుతున్న చిత్రం అని సమాచారం. ఈ చిత్రం షూటింగ్‌లో ఉండగానే నటుడు సూర్య దర్శకుడు శివతో చిత్రం చేయడానికి పచ్చజెండా ఊపారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ కేఈ.జ్ఞానవేల్‌రాజా నిర్మించనున్నారు.

ఇలాంటి పరిస్ధితుల్లో సూర్య మరో చిత్రానికి సై అన్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికే హరి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని నటుడు సూర్యనే తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది కాలం ఆగాల్సిందే.

ఇటీవల తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించే చిన్న బడ్జెట్‌ చిత్రాలనే నిర్మిస్తున్న సూర్య ఈ సారి తనే హీరోగా భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నారన్నమాట. ఎందుకంటే హరి దర్శకుడంటేనే కత్తులు, కార్ల బ్లాస్టింగ్, భారీ యాక్షన్‌ సన్నివేశాలు కచ్చితంగా చోటుచేసుకుంటాయి. అలా పక్కా మాస్‌ చిత్రాల దర్శకుడిగా ముద్ర వేసుకున్న హరి ఇటీవల నటుడు విక్రమ్‌ హీరోగా తెరకెక్కించిన సామి స్క్వేర్‌ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు.దీంతో ఈ సారి కథ విషయంలో దర్శకుడు హారి, నటుడు సూర్య తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ ముగ్గురిలో నేనున్నా!

మహేష్‌ని ఆడేసుకుంటున్నారు!

సందడిగా హుందాగా సాక్షి అవార్డుల వేడుక

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ సీరియస్‌

అంత టైమివ్వడం నాకిష్టం లేదు : ప్రభాస్‌

పెళ్లైన వ్యక్తితో ఎఫైర్‌.. అందుకే డిప్రెషన్‌: నటి

‘‘సాహో’ రికార్డులు సృష్టించాలి’

అందర్నీ ఓ రౌండ్‌ వేసుకుంటోన్న నాగ్‌

బాలీవుడ్‌పై బాంబ్‌ పేల్చిన హీరో!

‘సాహో’ ట్రైలర్‌ వచ్చేసింది

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ ఫైర్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఆరోగ్యం ఆందోళనకరం

గతంలో ఎన్నడు చూడని మోదీని చూస్తారు!

ఒక్క దెబ్బతో అక్షయ్‌ని కింద పడేసింది

సాయిపల్లవి ‘అనుకోని అతిథి’

‘డియర్‌ కామ్రేడ్‌’కి నో చెప్పిన బాలీవుడ్ హీరో

షాకింగ్ లుక్‌లో రామ్‌‌!

అభిమానిగా వెళ్లి నటుడినయ్యా

సాహోతో సైరా!

రానా సినిమా నుంచి టబు అవుట్‌!

పేరు చెడగొట్టకూడదనుకున్నాను

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?

ఆ చిత్రం నుంచి విజయ్‌సేతుపతి ఔట్‌

స్నేహితుడి కోసం...

కోలీ కాలింగ్‌!

వినోదాల ఎర్రచీర

మంచువారింట ఆనందం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌?

ఆ ముగ్గురిలో నేనున్నా!

సందడిగా హుందాగా సాక్షి అవార్డుల వేడుక

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ సీరియస్‌

అంత టైమివ్వడం నాకిష్టం లేదు : ప్రభాస్‌

అందర్నీ ఓ రౌండ్‌ వేసుకుంటోన్న నాగ్‌