వెనక్కి తగ్గిన సూర్య

3 Aug, 2019 15:34 IST|Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం కాప్పాన్‌. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే సాహో రిలీజ్‌ అదే రోజంటూ ప్రకటన రావటంతో తప్పని సరి పరిస్థితుల్లో కాప్పాన్‌ను ఆగస్టు 30కి వాయిదా వేశారు. కానీ తరువాత సాహో కూడా వాయిదా పడింది.

దీంతో కాప్పాన్‌ టీం మరోసారి ఆలోచనలో పడింది. అయితే ముందుగా ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రావాలని భావించినా ఇప్పుడు మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. భారీ అంచనాలున్న సాహోతో పోటి పడే కన్నా రిలీజ్ వాయిదా వేస్తేనే బెటర్‌ అని భావిస్తున్నారట. అందుకే సెప్టెంబర్‌ 13 లేదా 20 తేదిల్లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

కాప్పాన్ వాయిదాపై ఇంకా అధికారిక ప్రకటన లేకపోయినా వాయిదా పడటం ఖాయం అన్న టాక్‌ వినిపిస్తోంది. మలయాళ నటుడు మోహన్‌లాల్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై సూర్య చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందుకే రిలీజ్ విషయంలో భారీ పోటి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా తెలుగులో బందోబస్త్‌ పేరుతో రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు