సూర్య చిత్ర టైటిల్‌ ఉయిర్కా?

30 Dec, 2018 07:42 IST|Sakshi

నటుడు సూర్య తాజా చిత్రానికి ‘ఉయిర్కా’ అనే టైటిల్‌ దాదాపు ఖరారైనట్టే నంటున్నారు. సూర్య, సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరో హీరోయిన్లుగా సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఎన్‌జీకే. ఈ చిత్రం దీపావళికి విడుదల కావలసి ఉంది. అయితే చిత్ర ని ర్మాణంలో జాప్యం కారణంగా అనుకున్న విధంగా ఎన్‌జీకే చిత్రం తెరపైకి రాలేదు. ఇప్పటికీ ఈ చిత్ర విడుదలపై క్లారిటీ లేదు.

కాగా సూర్య తాజాగా మరో చిత్రంలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. కేవీ.ఆనంద్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్‌ సంస్థ నిర్మిస్తున్న ఇందులో నటి సాయేషా సైగల్‌ నాయకిగా నటిస్తోంది.  ఈ చిత్రం షూటింగ్‌ మాత్రం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్ర టైటిల్‌ విషయంలో చిత్ర వర్గాలు సూర్య అభిమానులకు మీట్పవన్, కాప్పన్, ఉయిర్కా మూడు పేర్లు చెప్పి ఏది బాగుందో చెప్పాల్సిందిగా అడిగారు.  దీంతో 50 శాతం ఓట్లు ఉయిర్కా టైటిల్‌కు పడ్డాయి.

దీంతో చిత్ర యూనిట్‌ కూడా ఉయిర్కా టైటిల్‌నే ఖారారు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్ర టైటిల్‌ను చిత్ర వర్గాలు నూతన సంవత్సం సందర్భంగా జనవరి ఒకటవ తేదీన వెల్లడించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్, ఆర్య, బొమన్‌ ఇరానీ, సముద్రకని ముఖ్య పాత్రలను పోషించడం విశేషం. హరీశ్‌జయరాజ్‌ సంగీతాన్ని అందిస్తున్న తాజా చిత్రం ఇది. అదేవిధంగా అయన్, మాట్రాన్‌ చిత్రాల తరువాత సూర్య, దర్శకుడు కేవీ.ఆనంద్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న చిత్రం ఇది కావడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా