సూర్య కొత్త సినిమా ఫస్ట్ లుక్

23 Jul, 2017 15:42 IST|Sakshi
సూర్య కొత్త సినిమా ఫస్ట్ లుక్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, తన కొత్త సినిమా కోసం ప్రయోగాలను పక్కన పెట్టి నార్మల్ లుక్లోకి వచ్చేశాడు. కొంత కాలంగా డిఫరెంట్ గెటప్ లతో అలరిస్తున్న ఈ స్టార్ హీరో తాజా చిత్రం 'తానా స్రేంద కూటం' కోసం ఎలాంటి ప్రయోగాలు చేయటం లేదు. ఈ రోజు (ఆదివారం) సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

నానుమ్ రౌడీ దా ఫేం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ స్పెషల్ చబ్బీస్ కు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను తెలుగులో రవితేజ హీరో గా రీమేక్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే కోలీవుడ్ వర్షన్ లో సూర్య నటిస్తుండటంతో ఇక రీమేక్ లేనట్టే అన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం మైసూర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాలో సూర్యకు జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది.