లాయర్‌ సూర్య

20 Mar, 2020 06:34 IST|Sakshi
సూర్య

‘సింగమ్‌’ సిరీస్‌లో సూర్య పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. చెప్పాలంటే హైపర్‌ యాక్టివ్‌ క్యారెక్టర్‌ అది. ఈ సిరీస్‌లో పోలీస్‌ పాత్రలో హై పిచ్‌లో సూర్య డైలాగులు చెప్పారు. ఇప్పుడు లాయర్‌గా అదే రేంజ్‌లో కోర్టులో వాదన వినిపించడానికి రెడీ అవుతున్నారట. ‘కూటత్తిల్‌ ఒరుత్తన్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో గిరిజనుల నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కనుందట. ఇందులో హీరో సెలెక్ట్‌ కాలేదు. అయితే ఓ కీలక పాత్ర చేయడానికి సూర్య అంగీకరించారని కోలీవుడ్‌ టాక్‌. లాయర్‌గా కనిపిస్తారట. ఇదిలా ఉంటే సూర్య నటించిన తాజా చిత్రం ‘ఆకాశమే నీ హద్దు రా’ విడుదలకు సిద్ధమవుతోంది. హరి దర్శకత్వంలో సూర్య నటించనున్న ‘అరువా’ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. ‘అరువా’ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు