రాజకీయ నాయకుడిగా సూర్య

24 Jun, 2018 16:37 IST|Sakshi

కోలీవుడ్ స్టార్‌హీరో సూర్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎన్‌జీకే. విలక్షణ చిత్రాల దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మిస్తున్నారు. సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడట.

ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ జరుపుకున్న ఈసినిమా ఫస్ట్‌ లుక్ ఇటీవల విడుదలైంది. సూర్య క్యూబా విప్లవకారుడు చేగువరాల కనిపించిన లుక్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. సూర్య సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్, సాయి పల్లవిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమా ను దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

మరిన్ని వార్తలు