సినిమా వరకే... తర్వాత ఆపేద్దామన్నాడు!

24 Sep, 2019 00:24 IST|Sakshi
సుర్వీన్‌ చావ్లా

‘‘నా కెరీర్‌లో ఐదుసార్లు క్యాస్టింగ్‌ కౌచ్‌ పరిస్థితులను ఎదుర్కొన్నాను. రెండు సార్లు బాలీవుడ్‌లో మూడుసార్లు సౌత్‌ ఇండస్ట్రీలో’’ అని పేర్కొన్నారు బాలీవుడ్‌ నటి సుర్వీన్‌ చావ్లా. టెలివిజన్‌ నుంచి ఫిల్మ్‌ ఇండస్ట్రీకి వచ్చారు సుర్వీన్‌. తెలుగులో ‘రాజు మహారాజు’ హిందీలో ‘హమ్‌ తుమ్‌ షబానా, అగ్లీ, హేట్‌ స్టోరీ 2, పార్చడ్, తమిళంలో ‘మూండ్రు పేర్‌ మూండ్రు కాదల్, పుదియ  తిరుప్పంగళ్‌’  సినిమాల్లో నటించారామె.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్‌ కౌచ్‌ సంఘటనల గురించి సుర్వీన్‌ చెబుతూ – ‘‘టీవీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ సినిమాల్లో నా ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. సౌత్‌లో ఓ చిత్రదర్శకుడు ‘నీ శరీరంలోని ప్రతి భాగాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నాడు. అప్పటి నుంచి అతని ఫోన్‌ కాల్స్‌ లిఫ్ట్‌ చేయడం మానేశాను. ఇంకోసారి ఓ నేషనల్‌ అవార్డు పొందిన దర్శకుడుకి ఆడిషన్‌ ఇవ్వడానికి వెళ్లాను. ఆ ఆడిషన్‌లో అనవసరమైన డైలాగ్స్‌ చెప్పించి, ఏదో ఏదో చేయించాడు.

ఆరోగ్యం బాలేదని ముంబై తిరిగొచ్చాను. ‘నీ ఆరోగ్యం బాలేదు కదా. నేను కూడా ముంబై రానా?’ అని ఫోన్‌ చేసి అడిగించాడు. చాలా చీప్‌గా అనిపించింది. ‘నో థ్యాంక్యూ’ అన్నాను. అతనికి తమిళం తప్ప వేరే భాష రాదు. వేరే అతనితో మాట్లాడించాడు. ‘సినిమాకు చాలా టైమ్‌ పట్టేలా ఉంది. సార్‌ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. కేవలం సినిమా జరిగేవరకే.. ఆ తర్వాత ఆపేయొచ్చు’ అన్నాడు. నేను చాలా అమాయకంగా ‘ఏం ఆపేయాలి’ అని అడిగా. ‘కేవలం సినిమా జరిగేవరకే.. ఆ తర్వాత ఆపేయొచ్చు’ అని మళ్లీ రిపీట్‌ చేశాడు.

‘మీరు రాంగ్‌ డోర్‌ని తడుతున్నారు. ఒకవేళ మీ సార్‌ నేను టాలెంటెడ్‌ అనుకుంటే నేను పని చేయడానికి సిద్ధమే’ అన్నాను. ఆ సినిమా ఇప్పటి వరకూ జరగలేదు. రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లో ‘నీ ఎద ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను’ అని ఒక దర్శకుడు, ‘నీ తొడలు ఎలా ఉంటాయో చూడాలనుకుంటున్నాను’ అని మరొక దర్శకుడు కోరారు. వాళ్ల ఆఫీసుల నుంచి వెంటనే బయటకు వచ్చేశాను’’ అని పేర్కొన్నారు. ‘‘నిజానికి నా బరువు 56 మాత్రమే. అయినప్పటికీ ‘లావుగా ఉన్నావు’ అంటూ అదోలా చూసేవాళ్లు’ అని కూడా సుర్వీన్‌ వాపోయారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొండారెడ్డి బురుజు @ నాలుగున్నర కోట్లు

దాసరి గుర్తుండిపోతారు

హాయిగా నవ్వండి

ప్యారిస్‌ ట్రిప్‌

శ్రీముఖిని దుమ్ముదులిపిన శివజ్యోతి

బన్నీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

‘మీమ్స్‌ అంటే పిచ్చి..ఇంకొన్ని కావాలి’ 

శివజ్యోతి-శ్రీముఖి.. హోరాహోరి పోరు

సెన్సార్‌ పూర్తి చేసుకున్న సైరా

బామ్మగా అదరగొట్టిన తాప్సీ

బిగ్‌బాస్‌: రాహుల్‌ ఈజ్‌ బ్యాక్‌

‘మెర్శల్‌’ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ కొత్త సినిమా!

అన్నయ్య పక్కన ఆ డైలాగ్‌ చాలు: పృధ్వీరాజ్‌

నాతో పెళ్లా..అయితే ట్రై చెయ్‌: హీరోయిన్‌

‘ఒక్కడు’కు మించి హిట్‌ సాధిస్తాం

పాపం.. రష్మికకు లక్కులేదు!

సరికొత్తగా ‘మ్యాడ్‌హౌస్‌’

డేట్‌ ఫిక్స్‌ చేసిన అల్లు అర్జున్‌?

ఆ కోరిక, కల అలాగే ఉండిపోయింది : చిరంజీవి

స్టేజ్‌పైన కన్నీరు పెట్టుకున్న హిమజ

కౌశల్‌ కూతురి బర్త్‌డే.. సుక్కు చీఫ్‌ గెస్ట్‌!

పెళ్లికొడుకు కావాలంటున్న హీరోయిన్‌

‘అమ్మో.. దేవీ అదరగొట్టేశారు’

బిగ్‌బాస్‌లో.. గద్దలకొండ గణేష్‌

కూతురితో బన్నీ క్యూట్ వీడియో!

బాలీవుడ్ జేజమ్మ ఎవరంటే?

చిత్ర పరిశ్రమ చూపు.. అనంతపురం వైపు!

నయన్‌ విషయంలోనూ అలాగే జరగనుందా?

మాఫియా టీజర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్యారిస్‌ ట్రిప్‌

సినిమా వరకే... తర్వాత ఆపేద్దామన్నాడు!

శ్రీముఖిని దుమ్ముదులిపిన శివజ్యోతి

బన్నీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

శివజ్యోతి-శ్రీముఖి.. హోరాహోరి పోరు

‘మీమ్స్‌ అంటే పిచ్చి..ఇంకొన్ని కావాలి’