కులూలో కూల్‌ కూల్‌గా...

4 Oct, 2018 00:39 IST|Sakshi
సూర్య, సాయేషా

దేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తున్నారు హీరో సూర్య. కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయేషా కథానాయికగా నటిస్తున్నారు. మోహన్‌లాల్, బొమన్‌ ఇరానీ, ఆర్య కీలక పాత్రలు చేస్తున్నారు. ఇటీవల నోయిడా షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రబృందం తాజా షూటింగ్‌ కోసం కులు మనాలీ వెళ్లారు. ఈ షూట్‌లో  సాయేషా కూడా పాల్గొంటున్నారు. హీరో, హీరోయిన్లపై కీలక  సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా ప్రేమ సన్నివేశాలు తీస్తున్నారు. ఈ సినిమాలో సూర్య కమాండో ఆఫీసర్‌గా నటిస్తున్నారట. సామాజిక స్పృహ ఉన్న కథాంశంతో సాగే ఈ సినిమాలో మంచి సందేశం ఉంటుందని సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా