పిల్లల కోసం సినిమా తీస్తున్న సూర్య

3 Jul, 2014 12:21 IST|Sakshi
పిల్లల కోసం సినిమా తీస్తున్న సూర్య

తమిళంతో పాటు తెలుగులో కూడా అభిమానులను సొంతం చేసుకున్న సూర్య.. ఇప్పుడు పిల్లల కోసం ఓ సినిమా తీస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహిస్తారు. సింగం-2 విజయంతో మంచి ఊపుమీదున్న సూర్య.. ఇప్పుడు కొత్తగా పిల్లల చిత్రం తీయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సినిమా కథను తాను సూర్యకు చెప్పగానే వెంటనే ఆయన దాన్ని నిర్మించడానికి ఒప్పుకొన్నారని, ఈ తరహా సినిమాలు పిల్లలను బాగా ఆకట్టుకుంటాయని చెప్పారని పాండ్యరాజ్ తెలిపారు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైపోయిందని అన్నారు. ఈ సినిమాలో ఇద్దరు పిల్లలు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. దీన్ని దర్శకుడు పాండిరాజ్, సూర్యల సొంత బేనర్ 2డి ఎంటర్టైన్మెంట్ మీద తీస్తున్నారు. జాతీయ అవార్డు పొందిన తమిళ పిల్లల చిత్రం పసంగాకు కూడా పాండిరాజే దర్శకుడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి