నంద గోపాలకృష్ణ

23 Jul, 2018 01:26 IST|Sakshi
సూర్య

‘ఎన్‌జీకే’.. అంటే ఏంటి? అని ఇన్ని రోజులు ఆలోచించిన సినీ లవర్స్‌కు సూర్య అండ్‌ టీమ్‌ ఆన్సర్‌ చెప్పేశారు. సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతోన్న సినిమా ‘ఎన్‌జీకే’. సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్‌.ఆర్‌. ప్రకాశ్‌ బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మిస్తున్నారు. సోమవారం సూర్య బర్త్‌ డే సందర్భంగా ఆదివారం ఈ సినిమా సెకండ్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు.

ఇక్కడ ఉన్న ఫొటో అదే. తమిళ పోస్టర్‌పై ‘ఎన్‌జీకే’ అంటే ‘నంద గోపాలన్‌ కుమారన్‌’ అని చెప్పారు టీమ్‌. మరి.. తెలుగు ‘ఎన్‌జీకే’ అంటే... ‘నంద గోపాలకృష్ణ’ అట. టైటిల్‌ క్యాప్షన్‌ను బట్టి నంద గోపాలకృష్ణ పాత్రలో సూర్య కనిపిస్తారని ఊహించవచ్చు. దాదాపు చిత్రీకరణ పూర్తి కావొచ్చిన ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా.

మరిన్ని వార్తలు