సుశాంత్‌ ఆత్మహత్యకు అదే కారణమా?

14 Jun, 2020 16:49 IST|Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర వార్త విన్న బాలీవుడ్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అటు అభిమానులు ఈ వార్త నిజంకాకుండా ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు. ఇక సుశాంత్‌ అభిమానులు అత్యంత శోకాతప్త హృదయాలతో ఆయన‌ నివాసానికి భారీగా చేరుకుంటున్నారు. (సుశాంత్‌ మరణం: షాక్‌లో సినీ ఇండస్ట్రీ)

ఇక సుశాంత్‌ డిప్రెషన్‌ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ముంబై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గడిచిన ఆరు నెలలుగా ఆయన డిప్రెషన్‌లో ఉన్నారని అటు పోలీసులు, ఇటు స్నేహితులు పేర్కొంటున్నారు. ఇక సుశాంత్‌ నివాసంలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని, కొన్ని మెడిసిన్స్‌ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి కొంత మంది స్నేహితులతో సుశాంత్‌ గడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక సుశాంత్‌ పార్థీవదేహాన్ని ఆయన నివాసం నుంచి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు.  (బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ ఆత్మహత్య)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు