ఆ నెంబ‌ర్‌కు సుశాంత్ అభిమానుల ఫోన్‌కాల్స్‌

7 Jul, 2020 15:00 IST|Sakshi

ఇండోర్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ యువ‌నికి కొద్ది రోజులుగా విప‌రీత‌మైన ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయి. క్ష‌ణం విడిచిపెట్ట‌కుండా ఒకరు విడిచి మ‌రొక‌రు పోన్లు చేస్తూనే ఉన్నారు. చేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ ఇది రాంగ్ నంబ‌ర్ అని చెప్ప‌లేక అత‌ను విసిగిపోయాడు. దీంతో ఆయ‌న‌ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. ఇంత‌కీ.. అత‌నికి వ‌స్తున్న ప్ర‌తీ కాల్ కూడా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోస‌మే కావ‌డం గ‌మ‌నార్హం. బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ జూన్ 14న ముంబైలోని త‌న నివాసంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అత‌ని మ‌ర‌ణ‌వార్త దేశ‌వ్యాప్తంగా ఉన్న‌ అభిమానుల‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్ర‌మంలో సుశాంత్ మాజీ ప్రేయ‌సి అంకితా లోఖండే పేరు మీద ఎవ‌రో గుర్తు తెలియ‌న వ్య‌క్తులు ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు. (‘గత నెల సుశాంత్‌ 50 సిమ్‌లు మార్చాడు’)

అందులో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌కు చెందిన‌ ఓ కూలీ నెంబ‌ర్‌ను పొందుప‌రిచారు. ఇది నిజ‌మైన అకౌంట్ అని న‌మ్మిన ఎంతో మంది సుశాంత్ అభిమానులు నిత్యం అత‌నికి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అయితే కొంద‌రు రాంగ్ నంబ‌ర్ అని తెలియ‌గానే క‌ట్ చేసిన‌ప్ప‌టికీ మరికొంద‌రు మాత్రం సుశాంత్ ఆత్మ‌హ‌త్య త‌మ‌ను కుంగ‌దీసిందంటూ అత‌ని ద‌గ్గ‌ర గోడు వెల్ల‌బోసుకుంటున్నారు. ఒక‌టీ, రెండు అయితే స‌ర్ది చెప్ప‌వ‌చ్చు కానీ ఫోన్లు చేసేవారి సంఖ్య వంద‌లు, వేలు దాటేస‌రికి అత‌ని నెత్తి బొప్పిక‌ట్టింది. దీంతో అత‌ను పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు.. న‌టి అంకిత లోఖండే పేరు మీద న‌కిలీ అకౌంట్ క్రియేట్ చేశార‌ని, అందులో స‌ద‌రు బాధితుడి నంబ‌ర్ పొంద‌రుప‌ర్చార‌ని గుర్తించారు. ఈ ఫేక్ అకౌంట్‌ను 40 వేల మంది ఫాలో అవుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇక ఆ అకౌంట్‌ను న‌డుపుతున్న‌ వ్య‌క్తిని ప‌ట్టుకునే ప‌నిలో ఉన్నారు. (ఐ వాన్న అన్‌ఫాలో యు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా