సుశాంత్‌ నెలకు ఎంత ఖర్చు చేస్తారంటే..?

22 Jun, 2020 17:12 IST|Sakshi
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (ఫైల్‌)

సాక్షి, న్యూఢిల్లీ: మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడిన బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉండేదని ఆయన మాజీ బిజినెస్‌ మేనేజర్‌ శ్రుతి మోదీ పోలీసుల విచారణలో వెల్లడించారు. 2019 జులై నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ శ్రుతి.. సుశాంత్‌ వద్ద పనిచేశారు. సుశాంత్‌ నెలకు 10 లక్షల రూపాయల వరకూ ఖర్చు చేసేవారని ఆమె పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఆయన తన బాంద్రా అపార్ట్‌మెంట్‌కు నెలకు 4.5 లక్షల రూపాయలు అద్దె చెల్లించేవారని, లొనావాల సమీపంలో లీజుకు తీసుకున్న ఫాంహౌస్‌కు లక్షల రూపాయల్లో అద్దె చెల్లించేవారని శ్రుతి తెలిపారు. కార్లు, బైక్‌లను అమితంగా ఇష్టపడే సుశాంత్‌ వద్ద రేంజ్‌ రోవర్‌, మాసరెటి వంటి లగ్జరీకార్లతో పాటు బీఎండబ్ల్యూ బైక్‌ ఉండేదని చెప్పారు.

సుశాంత్‌ నాలుగు ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్నారని సినిమాలతో పాటు ఆయనకు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నటనకు సంబంధించిన కోర్సులపై ఆసక్తి ఉండేదని వెల్లడించారు. తన వర్చువల్‌ రియాలిటీ ప్రాజెక్టు కోసం సుశాంత్‌ రెడ్‌ రియలిస్టిక్‌ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశారని, నేషన్‌ ఇండియా ఫర్‌ వరల్డ్‌ అనే ప్రాజెక్టుపై పనిచేయడం ద్వారా సుశాంత్‌ నాసా, ఇస్రోల గురించి పలు విషయాలు తెలుసుకున్నారని శ్రుతి చెప్పారు. మరోవైపు సుశాంత్‌ ‘జీనియస్‌ అండ్‌ డ్రాపవుట్స్‌’ అనే ప్రత్యేక సామాజిక ప్రాజెక్టుపైనా పనిచేస్తున్నారని శ్రుతి తండ్రి వెల్లడించారని ఓ వార్తాసంస్థ పేర్కొంది. ప్లానెట్స్‌, నక్షత్రాలను ప్రేమించే సుశాంత్‌ ఇంట్లో ప్రత్యేక టెలిస్కోప్‌ ఉందని పోలీసులు తెలిపారు.

చదవండి: సుశాంత్ మ‌ర‌ణం: మ‌రో అభిమాని ఆత్మ‌హ‌త్య‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు