అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

19 Sep, 2017 03:22 IST|Sakshi
అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

న్యూయార్క్‌: భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ సోమవారం జపాన్, అమెరికా దేశాల విదేశాంగ మంత్రులతో త్రైపాక్షిక చర్చలు జరిపారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వసభ్య సమా వేశం కోసం న్యూయార్క్‌ చేరుకున్న సుష్మ వారంపాటు అక్కడే ఉండనున్నారు. అమెరికా, జపాన్‌లతో సమావేశం గురించి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ వివరిస్తూ ‘అంతర్జాతీయ చట్టాలను గౌరవించడంతోపాటు వివాదాలను శాంతంగా పరిష్కరించుకోవాలని మూడు దేశాల మంత్రులు తీర్మానించారు’ అని చెప్పారు.

తీరప్రాంత భద్రత, అనుసంధానత విషయాలపై కూడా వీరు చర్చించారన్నారు. డోక్లాంతోపాటు దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రాలపై చైనా దుందుడుకుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ త్రైపాక్షిక భేటీ జరగడం గమనార్హం. అలాగే ఐరాసలో సంస్కరణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం నిర్వహించే సమావేశానికి సుష్మ హాజరవుతారు. అనంతరం ట్యునీషియా, నెదర్లాండ్స్, లత్వియా, బొలీవియా దేశాల విదేశాంగ మంత్రులు, భూటాన్‌ ప్రధానితో సుష్మ భేటీ అవుతారు. రానున్న రోజుల్లో మరిన్ని దేశాల ప్రధానులు, విదేశాంగ మంత్రులతో ఆమె ద్వైపాక్షిక, త్రైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

స్క్రీన్‌ టెస్ట్‌

ఆమె అసలు బాలయ్య కూతురేనా?

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?

రాజా చలో ఢిల్లీ