‘చారుపై ఎవరో ఒత్తిడి తీసుకు వస్తున్నారు’

14 Jul, 2020 08:16 IST|Sakshi

మాజీ విశ్వ సుందరి సుష్మతా సేన్‌ సోదరుడు రాజీవ్‌ సేన్‌ అతని భార్య చారు అపోసాతో విడిపోతున్నట్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వార్తలను ఆయన ఖండించారు.  అంతేగాక భార్య చారుతో గొడవపడి రాజీవ్‌ ముంబై ఇంటిని వదిలి ఢిల్లీ వెళ్లిపోయాడనే పుకార్లను కొట్టి పారేశారు. ఈ క్రమంలో రాజీవ్‌ సేన్‌ సోమవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి వార్తలు విన్నప్పుడు నా నవ్వును ఆపుకోలేను. నాకు మూడు ఇళ్లు ఉన్నాయి. ముంబై, ఢిల్లీ మరొకటి దుబాయిలో. చారుకు దగ్గరగా ఉన్న వారెవరైనా ఒత్తిడి తెచ్చి ఆమెను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే ఆమె చాలా అమాయకురాలు, మంచిదని పేర్కొన్నారు. (మరోసారి వార్తల్లోకెక్కిన స్టార్‌ జంట!)

తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న పుకార్లపై మాట్లాడుతూ.. ‘ఈ వార్తల వెనుక ఆమె ఫ్రెండ్ సర్కిల్‌లోని ఓ వ్యక్తి ఉన్నారు. తన స్నేహితుల మాటలు చారు నమ్మదని నేను నమ్ముతున్నాను. ఆ వ్యక్తి ఎవరో నేను తెలుసుకున్నాక అతని లేదా ఆమె పేరుతో పాటు వాళ్ల పోటో కూడా నేను మీకు చెబుతాను. వాస్తవాలను బయటపెడతాను’. అని వెల్లడించారు. కాగా ఇటీవల తమ సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో కావడమే కాకుండా పెళ్లి ఫోటోలు కూడా డిలీట్‌ చేశారు. దీంతో వీరి వివాహ బంధానికి స్వస్తి చెప్పబోతున్నారన్న నెజిటన్ల అనుమానం మరింత బలపడింది. గతేడాది జూన్‌లో మోడల్‌ అయిన రాజీవ్‌ సేన్‌, టీవీ నటి చారు అసోపా గోవాలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. (నెపోటిజ‌మ్‌పై తెలివిగా స్పందించిన‌ సుస్మితా సేన్‌)

మరిన్ని వార్తలు