పదేళ్ల తర్వాత సుస్మితా వెబ్‌ సిరీస్‌లో..

3 Jun, 2020 18:34 IST|Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌‌ పదేళ్ల తర్వాత తన సెకండ్ ఇన్సింగ్స్‌‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డిస్నీ, హాట్‌స్టార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఆర్య’ అనే వెబ్‌ సిరీస్‌తో సుష్మిత డిజిటల్ రంగంలోకి అరంగేట్రం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సుస్మితా తాను నటించిన ‘ఆర్య’ వెబ్‌ సిరీస్‌ ఫస్ట్ ‌లుక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా లో పొస్ట్‌ చేశారు. ‘మీ (అభిమానుల) వల్లనే నేను ఉ‍న్నాను. అతి త్వరలో హాట్‌ స్టార్‌లో నేను నటించిన ‘ఆర్య’ వెబ్‌ సిరీస్‌ రాబోతుంది’ అని కామెంట్‌ జత చేశారు. (YOLO అంటోన్న సోనూసూద్‌)

ఇక రామ్‌ మాధ్వనీ దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్య’ వెబ్‌ సిరీస్‌లో సుస్మితా టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. గత డిసెంబర్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ జరిగింది. రాజస్థాన్‌ నేపథ్యంలో ఈ వెబ్‌ సిరీస్‌ ఉంటుంది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ సుస్మితా కెమెరా ముందుకు వచ్చారు. 2010లో వచ్చిన ‘నో ప్రాబ్లమ్‌’ సినిమా తర్వాత లీడ్‌ రోల్‌కి నటిగా మేకప్‌ వేసుకోలేదామె.

“To turn her world upside down” #badidea 👊 New home, New ropes!!! #aarya ❤️ Hotstar Specials @disneyplushotstarvip @officialrmfilms #hotstarspecialsaarya #comingsoon I love you guys!!! 😍 AARYA 🎵#firstlook #yourstruly

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా