అవి నా జీవితంలో చీకటి రోజులు: నటి

18 May, 2020 14:43 IST|Sakshi

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌  జీవితంలో జరిగిన విషయాల గురించి తెలిస్తే ఆమె ఆత్మవిశ్వాసాన్ని తప్పక మెచ్చుకుంటారు. గతంలో తాను ఎదుర్కొన్న అనారోగ్య సమస్య గురించి.. దాని నుంచి బయటపడేందుకు తాను ఎలా శ్రమించిందో  వివరిస్తూ... ఓ వీడియో విడుదల చేశారు సుస్మితా సేన్‌. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లనో స్ఫూర్తిని నింపుతుంది.

ఆ వివరాలు.. ‘మన శరీరం గురించి మన కంటే బాగా ఎవరికి తెలియదు. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే మనం దాని మాట తప్పక వినాలి. 2014, సెప్టెంబర్‌లో నేను అడిసన్‌ అనే అరుదైన వ్యాధికి గురయ్యాను. రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. దాంతో నా శరీరం పూర్తిగా నీరసించిపోయింది. తీవ్ర నిరాశకు లోనయ్యాను. నాకు వ్యాధితో పోరాటం చేసే శక్తి కూడా లేదనిపించింది. తీవ్రమైన ఒత్తిడి వల్ల కళ్ల చుట్టు నల్లని వలయాలు ఏర్పాడ్డాయి. ఆ నాలుగేళ్లు నా జీవితంలో చీకటి రోజులు’ అన్నారు సుస్మిత.

సుస్మిత మాట్లాడుతూ.. ‘వ్యాధి నుంచి బయటపడటం కోసం తీవ్రంగా శ్రమించాను. ఒకానొక సమయంలో స్టెరాయిడ్స్‌ కూడా తీసుకున్నాను. వాటి వల్ల ఎన్నో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చాయి. ఇక జీవితాంతం ఇలా అనారోగ్యంతోనే ఉండాలేమో అని భయమేసింది. ఆ సమయంలో ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాను. అయ్యిందేదో అయ్యింది.. నాలోని నొప్పినే ఆయధంగా మార్చుకోవాలనుకున్నాను. అందుకే జపనీస్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ‘నాన్‌చాకు’ నేర్చుకున్నాను. అది నాకు మంచి ఫలితాన్నిచ్చింది. 2019నాటికి మళ్లీ నేను మాములు స్థితికి వచ్చాను. ఈ ప్రయాణంలో నేను నేర్చుకున్నది ఏంటంటే.. మన శరీరం గురించి మనకంటే బాగా ఎవరికి తెలియదు.అది చెప్పినట్లు వింటే.. ఆరోగ్యంగా ఉంటాము’ అని చెప్పుకొచ్చారు సుస్మితా.(నా కూతురు కన్నీళ్లు పెట్టించింది)

మరిన్ని వార్తలు