భవిష్యత్తుని వెంటాడుతుంది

7 Feb, 2019 05:24 IST|Sakshi
పూర్ణ, సాక్షీ చౌదరి

‘‘సువర్ణసుందరి’ లాంటి సినిమాలు రావడం పరిశ్రమకి చాలా అవసరం. దాని వల్ల కొత్త టెక్నీషియన్స్‌ పరిచయం అవుతారు. సూర్య రాసుకున్న కథ చాలా బాగుంది. తప్పకుండా ఇది ఓ మంచి సినిమా అవుతుంది’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో సూర్య ఎమ్‌.ఎస్‌.ఎన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’’ అన్నది ఉపశీర్షిక. ఎస్‌.టీమ్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎమ్‌.ఎల్‌. లక్ష్మీ నిర్మించిన ఈ చిత్రం అతి  త్వరలో విడుదల కానుంది.

ఈ చిత్రం ట్రైలర్‌ని దర్శకులు బి.గోపాల్‌ విడుదల చేశారు. డైరెక్టర్‌ సూర్య మాట్లాడుతూ– ‘‘సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. నటీనటులందరూ నాకు చాలా సహకరించారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఏడాది పట్టింది. అందుకే సినిమా విడుదల లేట్‌  అయింది. అయినా అవుట్‌పుట్‌ మాత్రం   చాలా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘సువర్ణసుందరి’  ఎక్స్‌ట్రార్డినరీ చిత్రం. హీరోయిన్స్‌ చాలా చక్కగా చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు అందగత్తె జయప్రద. ఆవిడ కూడా ఈ చిత్రంలో నటించారు.

టీమ్‌కి ఆల్‌ ద బెస్ట్‌’’ అని డైరెక్టర్‌ సాగర్‌ అన్నారు. ‘‘ఇది చాలా మంచి సినిమా. పాటలు. ఫైట్స్‌ చాలా బాగా వచ్చాయి’’ అన్నారు సాక్షీ చౌదరి. ‘‘సహనం అంటే అది సూర్యగారి నుంచే నేర్చుకోవాలి. చాలా ఓర్పుగా మంచి నటన రాబట్టుకున్నారాయన’’ అని పూర్ణ అన్నారు. హీరోలు ఇంద్ర, రామ్, రచయిత విజయేంద్రప్రసాద్,  రైటర్‌ ప్రదీప్,  స్టంట్‌ మాస్టర్‌ రామ్‌ సుంకర మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎల్లుమంతి ఈశ్వర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు